Three Girls Found Dead In Dam: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని డ్యామ్‌లో ముగ్గురు యువతుల మృతదేహలు అనుమానాస్పద రీతిలో లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం..జిల్లాలోని మౌరానీపుర్ పరిధిలో ఉన్న కురేచా డ్యామ్‌లో ఓ యువతి మృతదేహం తేలుతున్నట్లు శనివారం సాయంత్రం పోలీసులకు స్థానిక ప్రజలు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు.. డ్యామ్ దగ్గరకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే డ్యామ్‌లో మరో ఇద్దరి మృతదేహాలు తేలుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
మళ్లీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. మృతురాళ్లను రీనూ(28), రీతూ(30), రింకూ(26)గా పోలీసులు గుర్తించారు. రీనూ, రీతూ సొంత అక్కచెల్లెళ్లు అని, రింకూ వారి స్నేహితురాలని చెప్పారు.
'అంతా అనుమానాస్పదంగా ఉంది'
అయితే ఈ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉందని పోలీసులు తెలిపారు. ముగ్గుర్ని హత్య చేసి ఎవరైనా డ్యామ్‌లో పడేశారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. అసలు కారణాలు మాత్రం శవపరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే తెలుస్తాయని చెప్పారు. కుటుంబసభ్యులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.
'నెలకోసారి వెళ్లి వచ్చేవారు..'
డ్యామ్‌కు వెళ్తామని చెప్పి ముగ్గురు యువతులు శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరారని యువతుల కుటుంబసభ్యులు తెలిపారు. నెలకోసారి ముగ్గురు డ్యామ్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవారని చెబుతున్నారు. అయితే శుక్రవారం రాత్రి తిరిగి రాకపోవడం వల్ల ఫోన్ చేశామని.. స్విచ్చాఫ్ వచ్చిందని చెప్పారు.
బహిర్భూమికి వెళ్లిన బాలికపై రేప్
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిర్భూమికి వెళ్లిన దళిత మైనర్‌పై అఘయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.