తప్పిపోయిన తన తల్లి రైలు ప్రమాదంలో చనిపోయిందని భావించాడు ఓ వ్యక్తి. రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం వల్ల తన తల్లిదేనని భావించాడు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలను సైతం నిర్వహించాడు. అనంతరం ఒక రోజు తర్వాత ఆయన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
అసలేం జరిగిందంటే.. చెంగల్పట్టులోని గుడువంచెరుకి చెందిన వడివేలు తల్లి చంద్ర(72).. సెప్టెంబరు 20న గుడికి వెళ్లింది. అనంతరం ఆమె ఇంటికి రాలేదు. తల్లి ఆచూకీ కోసం కుమారుడు వడివేలు ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో ఆయన చాలా బాధపడ్డాడు. ఇంతలో తాంబరం రైలు పట్టాలపై ఓ వృద్ధురాలు మృతదేహం పడి ఉందని వడివేలుకు తెలిసింది. రైలు ప్రమాదంలో చనిపోయింది తన తల్లే అనుకున్నాడు వడివేలు. మృతురాలు ఫొటో కూడా చంద్రకు సరిపోలినట్లు ఉండడం వల్ల తన తల్లి మృతి చెందిందని భావించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు వడివేలు.