తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళా కమిషన్​ చీఫ్​ ఇంటిపై రాళ్ల దాడి.. కార్లు ధ్వంసం.. ఏం జరుగుతోంది? - స్వాతి మాలివాలా

దిల్లీ మహిళా కమిషన్​ చీఫ్​​ స్వాతి మాలివాల్​ ఇంటిపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కార్లను సైతం ధ్వంసం చేశారు. అయితే ఆ సమయంలో స్వాతి ఇంట్లో లేరు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని ఆమె ట్విట్టర్​ వేదికగా తెలిపారు. అసలేం జరిగిందంటే?

DCW Chairperson Swati Maliwal's house attacked, cars vandalised
DCW Chairperson Swati Maliwal's house attacked, cars vandalised

By

Published : Oct 17, 2022, 2:36 PM IST

Stone Pelting On Swati Maliwal House: దిల్లీ మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​​ స్వాతి మాలివాల్​ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఆమె ఇంటి ఆవరణలో ఉన్న కార్లను సైతం ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని స్వాతి.. ఆదివారం ట్విట్టర్​ వేదికగా తెలిపారు. "నేను, మా అమ్మ ఇంట్లో లేని సమయంలో కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. అదృష్టవశాత్తు మేము ఇంట్లో లేము. లేకపోతే ఏమయ్యేదో ఎంటో? మీరేం చేసినా భయపడేది లేదు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను" అంటూ ట్వీట్​ చేశారు.

రాళ్ల దాడిలో ధ్వంసమైన కారు

'దిల్లీ మహిళా కమిషన్​ చీఫ్​ సురక్షితంగా లేరు..'
అయితే ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దిల్లీ మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ స్వాతి సురక్షితంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై తక్షణమే దృష్టి సారించాలని దిల్లీ లెప్ట్​నెంట్​ గవర్నర్​ వీకే సక్సేనాను కేజ్రీవాల్​ కోరారు.

అత్యాచార బెదిరింపులు..
కొద్దిరోజుల క్రితం.. హిందీ బిగ్​బాస్-16​ కంటెస్టెంట్​ సాజిద్ ఖాన్​ను వెంటనే ఆ షో నుంచి బయటకు పంపించాలని స్వాతి మాలివాల్.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దాంతోపాటు ఆమె సాజిద్​ ఖాన్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్​ టైమ్​లో వచ్చే బిగ్​బాస్​ షోలో సాజిద్ ఖాన్​ లాంటి 'లైంగిక వేటగాడు' ఉండటం సరికాదు అని రాసుకొచ్చారు. దీంతో ఆమెను రేప్​ చేస్తామంటూ పలువురు దుండగులు సోషల్​ మీడియా వేదికగా మెసేజ్​లు చేస్తున్నారు. అయితే "మేము చేసే పని ఆపడానికే.. వారు ఇలా చేస్తున్నారు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేయమని దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. దర్యాప్తు చేసి దీని వెనుక ఎవరున్నారో వారిని అరెస్ట్ చేయాలని కోరబోతున్నా" అంటూ స్వాతి ట్వీట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details