తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లల కోసం మరో కరోనా టీకా- ఓకే చెప్పిన డీసీజీఐ - కొవోవ్యాక్స్​కు భారత్​లో అనుమతులు

Covovax approval India: పిల్లలకు సంబంధించి మరో కరోనా టీకా అత్యవసర వినియోగానికి భారత్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. కొన్ని షరతులతో కొవోవ్యాక్స్ వినియోగానికి పచ్చజెండా ఊపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Covovax
కోవోవ్యాక్స్

By

Published : Mar 9, 2022, 5:31 PM IST

Covovax approval India: 12 నుంచి 17 సంవత్సరాల పిల్లల కోసం భారత్​లో మరో కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది. సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా తయారు చేసిన కొవోవ్యాక్స్​ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కొన్ని షరతులతో అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

భారత్​లో 18 ఏళ్ల లోపు పిల్లలకు అందుబాటులోకి వచ్చిన నాలుగో వ్యాక్సిన్​గా కొవోవ్యాక్స్​ నిలవనుంది. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ గత వారంలో సిఫార్సు చేయగా.. డీసీజీఐ ఇందుకు పచ్చ జెండా ఊపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ వేసే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి:దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరణాలు

ABOUT THE AUTHOR

...view details