తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ 100 శాతం సురక్షితం' - టీకా అనుమతులపై డీసీజీఐ మీడియా సమావేశం

The DGCI will brief the media at 11 am today at the National Media Centre on COVID-19 vaccine. Covaxin is an indigenously developed coronavirus vaccine developed by Bharat Biotech in collaboration with the Indian Council of Medical Research (ICMR).

DCGI briefing to media on COVID-19 vaccine
డీసీజీఐ డైరెక్టర్​ జనరల్​ మీడియా సమావేశం

By

Published : Jan 3, 2021, 10:59 AM IST

Updated : Jan 3, 2021, 12:48 PM IST

12:16 January 03

తొలి విడతలో 9 లక్షల మందికి: దిల్లీ ఆరోగ్య మంత్రి

కొవిడ్​-19 వ్యాక్సిన్​కు అనుమతులు లభించిన క్రమంలో దిల్లీలో టీకా పంపిణీపై వివరాలు వెల్లడించారు దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్​. తొలి దశలో 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, 6 లక్షల మంది ఫ్రంట్​లైన్​ వర్కర్లకు టీకా అందిస్తామని తెలిపారు.

12:04 January 03

సీరం సీఈఓ హర్షం..

ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషిల్డ్‌ టీకాకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించటంపై సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాల సంతోషం వ్యక్తం చేశారు. వారాల వ్యవధిలోనే టీకాలను విడుదల చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కొవిషిల్డ్‌ అన్ని అంచెలను దాటిందన్న పూనావాల.. సురక్షితమైన, సమర్థత కలిగిన టీకాను త్వరలోనే తీసుకురానున్నట్లు చెప్పారు. దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన తొలిటీకా కొవిషిల్డ్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌, డీసీజీఐకి ధన్యవాదాలు తెలిపారు.

11:50 January 03

టీకా అనుమతిపై భారత్​ నిర్ణయాన్ని స్వాగతించిన డబ్ల్యూహెచ్​ఓ

కొవిడ్​-19 వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ). ఈ మేరకు వెల్లడించారు డబ్ల్యూహెచ్​ఓ ఈశాన్య ఆసియా ప్రాంత డెరెక్టర్​ జనరల్​ డాక్టర్​ పూనమ్​ ఖేత్రపాల్​ సింగ్​

11:39 January 03

100 శాతం సురక్షితం..

కరోనా వ్యాక్సిన్​ అనుమతులపై ప్రకటన చేసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు డీసీజీఐ డైరక్టర్​ జనరల్​ వీజీ సోమని. 'భద్రతా పరమైన సమస్యలు స్వల్పంగా ఉన్నా అనుమతించం. ఈ వ్యాక్సిన్లు వంద శాతం సురక్షితం. స్వల్ప జ్వరం, నొప్పులు, అలర్జీ వంటి దుష్ప్రభావాలు ప్రతి వ్యాక్సిన్​లో సాధారణంగా ఉంటాయి.' అని పేర్కొన్నారు.  

11:25 January 03

కొవిడ్​ రహిత, ఆరోగ్యవంతమైన భారత్​కు బాటలు: మోదీ

కరోనా వ్యాక్సిన్లు కొవిషీల్డ్​, కొవాగ్జిన్లకు డీసీజీఐ అనుతించటంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొవిడ్​పై పోరాటాన్ని బలోపేతం చేసేలా దీనిని నిర్ణయాత్మక మలుపుగా అభివర్ణించారు. టీకాల అనుమతి.. ఆరోగ్యవంతమైన, కొవిడ్​ రహిత భారత్​కు బాటలు వేస్తుందన్నారు. దేశం, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

11:09 January 03

కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు ఆమోదం

కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాలకు డీసీజీఐ అనుమతి

భారత్​లో కరోనా వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. స్వదేశీ వ్యాక్సిన్​ కొవాగ్జిన్​తో పాటు కొవిషీల్డ్​ అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది డ్రగ్​ కంట్రోలర్ జనరల్​​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ).  

టీకా అనుమతులపై మీడియా సమావేశం నిర్వహించి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు డీసీజీఐ డైరెక్టర్​ జనరల్​ సోమని. టీకా భద్రత, సమర్థతపై సీరం సంస్థ వివరాలు సమర్చించినట్లు తెలిపారు. అలాగే.. భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​ భద్రతమైనదని ఇప్పటికే నిర్ధరణ అయినట్లు చెప్పారు. తొలి 2 దశల పరీక్షల్లో 800 మందిపై కొవాగ్జిన్​ ట్రయల్స్​ విజయవంతమయ్యాయని, మూడో దశలో 25,800 మంది వలంటీర్లకు కొవాగ్జిన్​ టీకా ఇచ్చినట్లు తెలిపారు. 

11:01 January 03

మీడియా సమావేశం ప్రారంభం

కరోనా వ్యాక్సిన్ అనుమతులపై డీసీజీఐ డైరెక్టర్​ జనరల్​ మీడియా సమావేశం ప్రారంభమైంది.

10:27 January 03

డీసీజీఐ డైరెక్టర్​ జనరల్​ మీడియా సమావేశం

దేశంలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి సంబంధించి డీసీజీఐ ఈరోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాసేపట్లో డీసీజీఐ డైరెక్టర్ జనరల్ మీడియా ముందుకు రానున్నారు. ఈ మేరకు వైద్యశాఖ వర్గాలు ఓ ప్రకటన చేశాయి. 

కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలను అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో ఆ దిశగా డీసీజీఐ ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. డీసీజీఐ ప్రకటన కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్‌ తయారుచేయగా.. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకాతో కలిసి పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈనెల 1న కొవిషీల్డ్‌కు, శనివారం కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని నిపుణుల బృందం సిఫారస్ చేసింది. 

డీసీజీఐ నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తొలి దశలో 3 కోట్ల మందికి..

దేశవ్యాప్తంగా తొలిదశలో 3 కోట్ల మందికి కరోనా టీకా ఉచితంగా  వేయనున్నారు. 50ఏళ్లకుపై పడిన 27 కోట్ల మంది ప్రాధాన్య లబ్ధిదారులను ఎంపిక చేయటానికి వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. కొవిడ్‌ టీకా కోసం కేంద్ర వైద్య శాఖ ఇప్పటికే రెండు విడతలుగా డ్రై రన్‌ నిర్వహించింది. కొవిడ్ టీకాను వేగంగా సరఫరా చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. 

Last Updated : Jan 3, 2021, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details