Bharat Biotech intranasal COVID vaccine: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు' కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణకు అనుమతులను సూత్రప్రాయంగా మంజూరు చేసింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ). అనుమతులకు అవసరమైన పత్రాలు, క్లినికల్ పరీక్షల ప్రక్రియను సమర్పించాలని స్పష్టం చేసింది.
భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా పరీక్షలకు అనుమతి
Bharat Biotech intranasal COVID vaccine: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా క్లినికల్ పరీక్షల నిర్వహణకు సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది డీసీజీఐకి చెందిన నిపుణుల కమిటీ. అవసరమైన పత్రాలను సమర్పించాలని కోరింది.
'ఒమిక్రాన్' కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో 'బూస్టర్ డోసు'పై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అందువల్ల చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింది. దాదాపు 5,000 మంది వలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో సగం మందిని కొవాగ్జిన్, మిగిలిన సగం మందిని కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారి నుంచి ఎంచుకుంటారని తెలుస్తోంది. సాధారణంగా రెండో డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్ డోసు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.