Children corona vaccine: 12-18 ఏళ్ల పిల్లలకు మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. బయోలాజికల్-ఇ సంస్థకు చెందిన కార్బీవాక్స్ వ్యాక్సిన్ వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తుది అనుమతులు ఇచ్చింది. గత వారంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేయగా.. డీసీజీఐ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 12-18 ఏళ్ల పిల్లలకు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా కార్బీవ్యాక్స్ నిలిచింది. రెండు డోసుల కింద ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. ఈ టీకా ధర రూ.145 (పన్నులు కాకుండా) ఉండొచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పిల్లల కరోనా టీకాకు డీసీజీఐ ఫైనల్ అప్రూవల్
Children corona vaccine: 12 నుంచి 18 సంవత్సరాల పిల్లల కోసం 'బయోలాజికల్-ఇ' రూపొందించిన కరోనా టీకా కార్బీవ్యాక్స్కు భారత ఔషధ నియంత్రణా సంస్థ తుది అనుమతులు ఇచ్చింది.
Corbevax
12 ఏళ్లలోపు పిల్లలకు కూడా బయోలాజికల్-ఇ టీకాలను రూపొందించనుంది. ఇందుకోసం క్లినికల్ ట్రయల్స్‌కు అవసరమయ్యే డేటాను కూడా త్వరలోనే డీసీజీఐకి సమర్పించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి:కడుపులో చాయ్ గ్లాస్.. ఎలా మింగేశాడంటే..?
Last Updated : Feb 21, 2022, 6:41 PM IST