తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో రెండు కొవిడ్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

DCGI approval: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మరో రెండు కొవిడ్​ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. దేశీయంగా తయారైన ఎంఆర్​ఎన్​ఏ సహా 7-11 ఏళ్ల చిన్నారులకు కొవొవాక్స్​ టికాలకు అనుమతులు లభించాయి.

DCGI
కొవిడ్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

By

Published : Jun 29, 2022, 6:54 AM IST

DCGI approval: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశీయంగా తయారైన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. జెన్నోవా బయో-ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తిచేసిన ఈ టీకాను 18 ఏళ్లు నిండినవారికి అందించవచ్చని తెలిపింది. ఇతర ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ డోసుల మాదిరి వీటిని జీరో ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదు. 2-8 డిగ్రీల వద్ద కూడా జెన్నోవా వ్యాక్సిన్‌ను నిల్వ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.

7-11 ఏళ్ల చిన్నారులకు 'కొవొవాక్స్‌'..7-11 ఏళ్ల వయసు చిన్నారుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తయారుచేసిన కొవొవాక్స్‌ టీకాకూ డీసీజీఐ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐఐలో ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్‌ ప్రకాశ్‌కుమార్‌ సింగ్‌ ఈ ఏడాది మార్చి 16న దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ.. అత్యవసర వినియోగం నిమిత్తం కొవొవాక్స్‌కు అనుమతి ఇవ్వొచ్చని సూచించింది. ఈ మేరకు చిన్నారులకు వినియోగించేందుకు ఆమోదం తెలిపినట్టు డీసీజీఐ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

గర్భాశయ క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు..గర్భాశయ క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు సీరం సంస్థ తయారుచేసిన ‘సెర్వావాక్‌’ టీకాకు ఆమోదం తెలపాలని వ్యాక్సినేషన్‌కు సంబంధించిన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) కేంద్రానికి సిఫారసు చేసింది. త్వరలోనే డీసీజీఐ దీనికి ఆమోదముద్ర వేసే అవకాశముంది. మరోవైపు- టైఫాయిడ్‌ను అడ్డుకునే మరో వ్యాక్సిన్‌కూ ఆమోదం తెలపాలని ఎన్‌టీఏజీఐ సిఫారసు చేసినట్టు సమాచారం.

ఇదీ చూడండి:రోడ్డు మధ్యలో నుంచి పొగ.. పక్కనే విద్యుత్ స్తంభం.. స్థానికుల భయాందోళన

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం.. ఏయే వస్తువులంటే..

ABOUT THE AUTHOR

...view details