కొవిడ్-19 మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమై ఆసుపత్రులో చేరిన రోగులకు మరో ఔషధం(tocilizumab) అందుబాటులోకి రానుంది. భారత్‌లో కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరిన వయోజనులకు అందించేందుకు తమ ఔషధం టొసిలిజుమాబ్(tocilizumab injection hetero) అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతించినట్లు హెటిరో ఫార్మా ప్రకటించింది. తాజా నిర్ణయంతో.. తీవ్ర అనారోగ్యానికి గురై స్టెరాయిడ్స్ అందుకుంటున్న లేదా ఆక్సిజన్, వెంటిలేషన్ అవసరమైన వారికి ఇచ్చేందుకు(tocilizumab uses) ఆసుపత్రులకు అధికారం లభించినట్లయిందని పేర్కొంది.
" భారత్‌లో హెటిరో ఔషధం టొసిలిజుమాబ్కు అనుమతులు రావటం సంతోషంగా ఉంది. దీని ద్వారా మా సాంకేతిక సామర్థ్యం, కొవిడ్ నివారణలో ముఖ్యమైన ఔషధాల ఉత్పత్తిలో మా నిబద్ధత నిరూపితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి కొరత ఉంది. ఈ క్రమంలో భారత్‌లో అనుమతులు రావటం సరఫరా భద్రతకు కీలకంగా మారనుంది. సమానంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం. "