అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు జరుగుతున్న సమయంలోనే మజర్-ఎ-షరీఫ్ నగరం నుంచి సుమారు 50 మంది భారత కాన్సులేట్ అధికారులను స్వదేశానికి తరలించింది భారత వాయుసేన. ఇది జరిగిన రెండు రోజులకే ఆ నగరాన్ని ఆక్రమించారు తాలిబన్లు.
అఫ్గాన్‌లోని భారత కాన్సులేట్ సహా ఐటీబీపీ అధికారులను ఈ నెల 11, 12 తేదీల్లో వాయుసేన ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాందహార్‌లోని కాన్సులేట్ సిబ్బందిని కూడా ఆ నగరాన్ని ముష్కరమూకలు ముట్టడించడానికి ముందే కాబుల్ రాయబార కార్యాలయానికి తరలించింది కేంద్ర ప్రభుత్వం. కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత సుమారు 180 మంది అధికారులను భారత్‌కు రప్పించింది.