ప్రధాని నరేంద్ర మోదీ మోదీ.. బంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. దేశానికి మోదీ పేరు పెట్టే రోజు ఎంతో దూరం లేదని ఘాటుగా విమర్శించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించిన మమత.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"అసత్యాలు, అబద్ధాలను వ్యాపింప చేయడానికి ఎన్నికల సమయంలో వారు(భాజపా నేతలు) బంగాల్‌కు వస్తారు. మహిళల భద్రత కోసం ఆయన ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే భాజపా పాలక రాష్ట్రాల్లో మహిళల పరిస్థితి ఏంటి? మోదీకి ప్రియమైన గుజరాత్లో అతివల పరిస్థితి ఎలా ఉంది?
అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియానికి తన(మోదీ) పేరు పెట్టుకున్నారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ ధ్రువపత్రాల్లో తన ఫొటోను ముద్రించుకున్నారు. దేశానికీ ఆయన పేరు పెట్టే రోజు దగ్గరలోనే ఉంది."