తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో మరో 51వేల కరోనా కేసులు - కరోనా కేసులు

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 51,751 మంది వైరస్​ బారిన పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 13,685 మందికి పాజిటివ్​గా తేలింది.

Day after logging highest tally, Maha sees 51,751 new cases
మహారాష్ట్రలో మరో 51వేల కరోనా కేసులు

By

Published : Apr 12, 2021, 10:52 PM IST

మహారాష్ట్రలో తాజాగా 51,751 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 34,58,996కి చేరింది. మరో 258 మంది కరోనాకు బలయ్యారు. ఒక్కరోజే 52,312 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,64,746 యాక్టివ్​ కేసులున్నాయి.

దిల్లీలో..

దిల్లీలో ఒక్కరోజే 11,491 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7,36,688కు చేరింది. మరో 72మంది మృతి చెందారు.

యూపీలో విజృంభణ

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. తాజాగా 13,685 కేసులు వెలుగుచూశాయి. మరో 72 మంది చనిపోయారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొత్తగా 9,579 మంది వైరస్​ బారిన పడగా.. 52 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,74,869కు చేరింది.

తమిళనాడులో..

తమిళనాడులో కొత్తగా 6711 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 19 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,40,145కు చేరింది.

కేరళలో మరో 5,692 కేసులు బయటపడ్డాయి. తాజాగా 11 మంది కరోనాతో మరణించారు.

రాష్ట్రం తాజా కేసులు తాజా మరణాలు
బంగాల్ 4,511 14
గుజరాత్ 6,021 55
పంజాబ్ 3,477 52
హరియాణా 3,818 14
రాజస్థాన్ 5,771 25

ఇదీ చూడండి:కరోనా వ్యాప్తిపై ఎయిమ్స్​ డైరెక్టర్​ తీవ్ర హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details