అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను అరెస్టు చేశారు ముంబయి మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ అధికారులు. డ్రగ్స్ సరఫరా కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇటీవలే అధికారులు సీజ్ చేసిన 15 కేజీల హాషిష్ మత్తు పదార్థం సరఫరాలో.. కస్కర్ పాత్ర ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. 2017లోనే దోపిడీ కేసులో థానే పోలీసులు కస్కర్‌ను అరెస్టు చేశారు. అయితే.. బుధవారం కస్కర్‌ను బల్లార్డ్ ఎస్టేట్ ఎన్సీబీ కార్యాలయానికి తరలించారు.