తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్‌పై మళ్లీ దావూద్‌ గురి.. దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర..

Dawood Ibrahim Targets India: గ్యాంగ్​స్టర్​, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్​ ఇబ్రహీం భారత్​పై మళ్లీ గురిపెట్టినట్లు సమాచారం. దావూద్‌, తన ప్రత్యేక యూనిట్‌తో కలిసి భారత్‌ వ్యాప్తంగా భీకర దాడులకు ప్రణాళికలు రచిస్తోన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. బాంబు పేలుళ్లు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది.

dawood ibrahim
దావూద్​ ఇబ్రహీం

By

Published : Feb 19, 2022, 1:50 PM IST

Dawood Ibrahim Targets India: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌పై మళ్లీ గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా వెల్లడించడం కలకలం రేపుతోంది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

దేశవ్యాప్తంగా కుట్రలకు..

దావూద్ ఇబ్రహీంపై ఇటీవల ఎన్‌ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. దావూద్‌, తన ప్రత్యేక యూనిట్‌తో కలిసి భారత్‌ వ్యాప్తంగా భీకర దాడులకు ప్రణాళికలు రచిస్తోన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. బాంబు పేలుళ్లు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది.

ముఖ్యంగా దిల్లీ, ముంబయిపై దావూద్‌ దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. దావూద్‌ హిట్ లిస్ట్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు సదరు కథనాలు తెలిపాయి.

దావూద్ సోదరి ఇంట్లో సోదాలు..

ఈ అభియోగ పత్రం ఆధారంగా ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దావూద్‌పై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబయిలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది కూడా. దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌ ఇంటికి కూడా అధికారులు వెళ్లినట్లు తెలిసింది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లోనూ ఈ సోదాలు జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

మాఫియా హవాలా లావాదేవీలు, అక్రమాస్తుల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌పై కూడా మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అతడిని కస్టడీలోకి తీసుకుంది.

ఇదీ చూడండి:నిద్రించే 'డ్రైవర్​కు అలర్ట్'.. రోడ్డు ప్రమాదాలకు చెక్!

ABOUT THE AUTHOR

...view details