Accused find out by dog: 'తుంగ 777 చార్లీ' శునకం దావణగిరి జిల్లా పోలీసులకు వెన్నెముకలా నిలుస్తోంది. అనేక కేసుల్లో నిందితులను పట్టించిన ఈ శునకం తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఛేదించింది. జూన్ 22న హొన్నాలి తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన నిందితుడు హరీశ్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన హొన్నాలి పోలీసులు.. విచారణ చేపట్టారు.
హత్యాచార నిందితుడిని పట్టించిన శునకం - దావణగెరె వార్తలు
Accused find out by dog: కర్ణాటక దావణగెరె జిల్లాలో ఓ పోలీసు శునకం నిందితులకు సింహస్వప్నంలా మారింది. అనేక కేసుల్లో నిందితులను పట్టించిన ఈ శునకం తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఛేదించింది.
ఈ క్రమంలోనే నిందితుడి కోసం జిల్లా పోలీసు బ్రిగెడ్ 'తుంగ 777 చార్లీ' అనే శునకాన్ని రంగంలోకి దించారు పోలీసులు. ఘటనా స్థలానికి వచ్చిన శునకం నేరుగా నిందితుడు హరీశ్ ఇంటికి వెళ్లి ఆగింది. హత్య చేసిన అనంతరం హరీశ్.. ఆ ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తుంగ.. నిందితుడు స్నానం చేసిన ప్రదేశానికి సైతం వెళ్లింది. 'తుంగ 777 చార్లీ' 2009 నుంచి పోలీసు శాఖలో పనిచేస్తోంది. ఈ పన్నెండేళ్లలో 70 హత్యలు, 35 దొంగతనాల కేసులను ఛేదించింది.
ఇదీ చదవండి:ఎత్తైన చెట్లపై దూకుతూ కోతిని వేటాడిన చిరుత.. వీడియో వైరల్