అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కర్ణాటకలోని దావనగెరెకు చెందిన వివేకానంద అనే వ్యక్తి మాస్కులు పంపించారు. తనే స్వయంగా మాస్కులకు తయారు చేశారు. మూడు పొరలున్న ఈ మాస్కులు అమెరికా చేరుకున్నాయి.
వివేకానంద తయారుచేసిన మాస్కులు గతేడాది లాక్డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి మాస్కులు తయారు చేయడం మొదలు పెట్టారు వివేకానంద. భార్య శాంతా, కూతురు కావ్య ఆయనకు సాయం చేస్తున్నారు.
వివేకానంద తయారు చేసిన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మాస్కులు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి.
మాస్కులు తయారు చేస్తున్నవివేకానంద, శాంతా వివేకానంద తయారు చేసిన మాస్కులు వివేకానంద తయారు చేసిన మాస్కులు గతేడాది.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు మాస్కులు పంపించారు వివేకానంద. వారి నుంచి అభినందనలూ అందుకున్నారు.
ఇదీ చదవండి:ఇంటినే కొవిడ్ కేంద్రంగా మార్చిన మంత్రి