కుల రక్కసి మానవత్వాన్ని మంట గలిపిన ఘటన మహారాష్ట్రలో మరోసారి వెలుగుచూసింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేయడానికి 'కుల పంచాయతీ' బహిష్కరణ తీర్పునకు భయపడి చంద్రాపుర్కు చెందిన ఏ గ్రామస్థుడూ సాహసించలేదు. దీంతో ఆయన కూతుళ్లే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
పలు ఆర్థిక కారణాల వల్ల ప్రకాశ్ ఓగ్లే అనే వ్యక్తి కుటుంబంపై సామాజిక బహిష్కరణ సహా జరిమానా విధించింది కుల పంచాయతీ. జరిమానా చెల్లించలేని స్థితిలో ఉన్న ఓగ్లే.. 15 ఏళ్లుగా వెలివేతను అనుభవిస్తున్నారు. ఆయనకు ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.