కూతురు సమానంగా పెంచుకుంటున్న మేకకు సీమంతం చేశారు కర్ణాటక చిత్రదుర్గ జిల్లా నన్నివాలా గ్రామానికి చెందిన రాజు-గీతా దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె రంజిత పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఓ మేకను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ కుటుంబ సభ్యులు.
ఈ మేక అంటే చాలా ఇష్టం. నా కుమార్తెతో సమానంగా చూసుకుంటా. నా పెద్ద కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన యుకుడిని వివాహం చేసుకుంది. ఈ ఘటన తరువాత ఒక మేకను తెచ్చుకుని.. కుమార్తెలాగా ప్రేమగా చూసుకుంటున్నా.
-గీత
ఈ మేకకు ముందు వారు ఒక జింకను పెంచుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల వల్ల జింకను అడవిలో వదిలిపెట్టారు. దీంతో రాజు కుటుంబ సభ్యులంతా మానసికంగా కుంగిపోయారు.