Daughter molested father killed: కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపాడు తండ్రి. తన బావతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడు. మొండెం నుంచి తలను వేరు చేసి నదిలో పడేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖాండవా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓంకారేశ్వర్ డ్యాం బ్యాక్‌వాటర్స్‌లో మృతదేహాన్ని ముక్కలు చేసి పడేశారు నిందితులు. రెండ్రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. సోమవారం నిందితులను అరెస్టు చేశారు.
Madhya Pradesh crime news:మృతి చెందిన వ్యక్తిని త్రిలోక్గా గుర్తించారు పోలీసులు. అతడిని హత్య చేసి తల నరికేశారని తెలిపారు. రెండు కాళ్లను శరీరం నుంచి వేరు చేసి నదిలో పడేశారని చెప్పారు. 'నిందితుడు చనులాల్, తన బావ ఉమేశ్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత ఆ వ్యక్తిని బైక్‌పై.. నదీతీరంలో ఉన్న భైరవ ఆలయానికి తీసుకెళ్లారు. ఇక్కడే తల నరికేశారు. అనంతరం మోకాలి కింది వరకు కాళ్లను వేరు చేశారు. శరీర బాగాలను అజ్నాల్ నదిలో పడేశారు' అని పోలీసులు తెలిపారు. చనులాల్కు మృతుడు త్రిలోక్ వరుసకు బావ అవుతాడని పోలీసులు వెల్లడించారు.