తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లిని చంపిన 14ఏళ్ల బాలిక.. కారణం ఏంటి? - కుమార్తె చెతిలో తల్లి బలి

Daughter killed mother: తల్లిపై ఆగ్రహంతో ఓ 14 ఏళ్ల బాలిక వంట పాత్రతో ఆమె తలపై బలంగా కొట్టింది. దీంతో ఆమె తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ నొయిడాలో మంగళవారం జరిగింది.

daughter killed mother
తల్లిని చంపిన 14 ఏళ్ల బాలిక

By

Published : Feb 23, 2022, 11:00 AM IST

Updated : Feb 23, 2022, 7:34 PM IST

Daughter killed mother: ఓ 14 బాలిక ఫ్రయింగ్ ​ప్యాన్​తో కొట్టటం వల్ల ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​, నొయిడాలోని సెక్టార్​-77 అంతరిక్ష కెన్వాల్​ సొసైటీలో జరిగింది.

ఇదీ జరిగింది..

నొయిడాలోని శాహదరా ప్రాంతానికి చెందిన అనురాధ అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్ల తర్వాత భర్తతో విడిపోయి కుమార్తెతో పాటు.. నొయిడాలో నివాసం ఉంటోంది.

తల్లీకూతుళ్ల మధ్య మంగళవారం వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 14 ఏళ్ల బాలిక తల్లి తలపై ఫ్రయింగ్​ ప్యాన్​తో బలంగా కొట్టింది. తీవ్ర గాయాలైన అనురాధ స్పృహ కోల్పోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తన మేనకోడలు కొట్టడం ద్వారా అనురాధ చనిపోయినట్లు ఆమె తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్ట్​మార్టం నిర్వహించారు.

"బాధితురాలు అనురాధ తన కూతురితో కలిసి ఫ్లాట్​లో నివసిస్తోంది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. కూతురిని తిడుతూ, కొడుతూ ఉండేది. ఆమె ప్రవర్తన సైతం సరిగా ఉండేది కాదు. దీంతో ఆగ్రహానికి లోనైన బాలిక వంటపాత్రతో కొట్టింది. తీవ్ర గాయాలతో అనురాధ మృతి చెందింది. బాలికను కస్టడీలోకి తీసుకుని బాలనేరస్థుల కేంద్రానికి తరలించాం."

- రణ్​విజయ్​ సింగ్​, నోయిడా అదనపు డీసీపీ

ఇదీ చూడండి:ఆన్​లైన్​ గేమ్స్​కు బానిస- అప్పులు కట్టలేక ఆత్మహత్య

Last Updated : Feb 23, 2022, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details