తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్త ఇంట్లో కోడలి 'దోపిడీ'.. సోదరుడితో కలిసి కోటి మాయం! - ఇందోర్ క్రైమ్ న్యూస్

మహాలక్ష్మిగా భావించే ఇంటి కోడలే.. కన్నం వేసింది. సోదరుడితో కలిసి అత్తింటిని దోచేసింది. ఆభరణాలు, నగదు కలిసి కోటి రూపాయల వరకు చోరీ చేసింది. (Indore News)

daughter in law theft
కోడలి దొంగతనం

By

Published : Oct 17, 2021, 3:40 PM IST

మధ్యప్రదేశ్ ఇందోర్​లోని (Indore News) ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు కోటి రూపాయల విలువైన ఆభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. అక్టోబర్ 13న ఘటన జరగ్గా.. ఇంటి కోడలే ఈ చోరీకి పాల్పడినట్లు తాజాగా తేలింది. నిందితుల వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (Gold theft latest news)

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

గృహోపకరణాల దుకాణం నడిపిస్తున్న అగర్వాల్ కుటుంబం ఇందోర్​లో (Indore News) నివసిస్తోంది. తన తండ్రితో కలిసి రోహిత్ అగర్వాల్ దుకాణాన్ని చూసుకుంటున్నాడు. ఘటన సమయంలో రోహిత్.. తన తండ్రి, సోదరుడితో కలిసి దుకాణానికి వెళ్లాడు. రోహిత్ తల్లి, భార్య మాధురి, తమ్ముడి భార్య, వారి పిల్లలు ఇంట్లో ఉన్నారు. సాయంత్రం సమయంలో రోహిత్ తల్లి అస్వస్థతకు గురైంది. దీంతో మాధురి.. ఇంట్లో వారితో కలిసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. తిరిగొచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం (Gold theft latest news)జరిగింది.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

రంగంలోకి పోలీసులు

ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంటికి సంబంధం ఉన్నవారే దొంగతనం చేసి ఉంటారని అనుమానించారు. పనివారిని ప్రశ్నించారు. చివరకు ఇంటి కోడలు మాధురే చోరీకి పాల్పడిందని తేల్చారు. విచారణలో తన తప్పు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. తన సోదరుడు వైభవ్​తో కలిసి.. దొంగతనం ప్లాన్ వేసినట్లు చెప్పారు. (Indore news today)

దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో తన అత్తను ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు ఇంటి తలుపులను మాధురి తెరిచి ఉంచిందని పోలీసులు తెలిపారు. అనంతరం వైభవ్ అతడి స్నేహితుడు అర్బాజ్ ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు దోచుకెళ్లారని చెప్పారు. ఆస్తి తగాదాల వల్లే మాధురి దొంగతనం ప్లాన్ వేసిందని వివరించారు. వైభవ్​తో పాటు అతడికి సహకరించిన వ్యక్తి వద్ద నుంచి కేజీ 600 గ్రాముల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల వజ్రాభరణాలు, 600 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు

ఇదీ చదవండి:ప్రజలపైకి దూసుకెళ్లిన మరో కారు- దుర్గాదేవి నిమజ్జనం వేళ..

ABOUT THE AUTHOR

...view details