తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీవీ ఆపిందని అత్త చేతివేళ్లను విరిచేసిన కోడలు.. మధ్యలో వచ్చిన భర్తను సైతం.. - man set himself on fire while quarrelling

అత్త కోడళ్ల గొడవ ఏనాటికి ఓ కొలిక్కి రాదన్న నానుడిని నిజమైంది. చిన్న విషయానికే అత్త చేతివేళ్లను విరిచింది ఓ కోడలు. మధ్యలో వచ్చిన భర్తను సైతం కొట్టింది. ఈ ఉదంతం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మరోవైపు, బిర్యానీ వండలేదని భార్యను కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన లాతూర్​లో జరిగింది.

DAUGHTER IN LAW BITTEN AND BROKE MOTHER IN LAW FINGERS DISPUTE TV OFF ISSUE
DAUGHTER IN LAW BITTEN AND BROKE MOTHER IN LAW FINGERS DISPUTE TV OFF ISSUE

By

Published : Sep 7, 2022, 2:15 PM IST

కోడల్ని అత్త రాచి రంపాలు పెట్టే సీన్​ అన్ని పాత సినిమాల్లో కామనే! కానీ, ఈ ఇంట్లో మాత్రం సీన్​ రివర్స్​ అయింది. టీవీ సౌండ్​ తగ్గించమని అడిగినందుకు అత్త చేతివేళ్లను విరిచేసింది ఓ కోడలు. ఈ మహారాష్ట్రలోని అంబర్​నాథ్​లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
వృశాలీ కులకర్ణీ అనే మహిళ తన కోడలు విజయ కులకర్ణీ ఎప్పటిలాగే ఇంట్లో ఉన్నారు. వృశాలీ పూజ చేసుకుంటూ మంత్రాలు జపించింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న కోడలు విజయ టీవీ చేసుకుని చూస్తోంది. టీవీ సౌండ్​.. పూజకు అంతరాయం కలిగిస్తోందని వెంటనే దాన్ని ఆపేయమని కోడలికి చెప్పింది.

కానీ, కోడలు ఆమె మాటలు పెడచెవిన పెట్టి వాల్యూమ్​ ఇంకా పెంచింది. తన మాట వినలేదని ఆగ్రహించిన అత్త.. ఆ కోడలిని మందలించేందుకు వచ్చింది. వచ్చి టీవీని ఆపేసింది. అయితే, కోపంతో కోడలు రెచ్చిపోయింది. టీవీ ఆపిందని ఆమెపై చేయి చేసుకునేందుకు సిద్ధపడింది. అత్తను దుర్భాషలాడింది. అత్త సైతం తగ్గకపోవడం వల్ల.. వారి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. కొట్లాట సమయంలో అత్త వేలు చూపించి మాట్లాడిందని ఆమె వేలును విరిచేసింది కోడలు. ఆ గొడవ అంతటితో ఆగిపోలేదు. వారిద్దరూ గొడవ పడుతున్న సమయంలో కొడుకు సౌరభ్​ రంగంలోకి దిగాడు. ఇద్దరికీ సర్ది చెబుదామని మధ్యలో దూరిన అతనికి సైతం దెబ్బల నుంచి విముక్తి కలగలేదు, తీవ్ర గాయాలతో అత్త.. శివాజీ నగర్​ పోలీస్​ స్టేషన్​లో కోడలిపై ఫిర్యదు చేసింది.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా...
కర్ణాటకలోని కిలారాలో హృదయ విదారక ఘటన జరిగింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి కాలును తొలగించారు వైద్యులు. అనంతరం కాలును పూడ్చేయాలని బాధితుడి భార్యకు చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏమైందంటే?
గ్యాంగ్రీన్​తో బాధపడుతున్న తన భర్త ప్రకాష్​ను మండ్య వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చింది భాగ్యమ్మ అనే మహిళ. అయితే ఆమె అడ్మిట్​ చేసిన మూడు రోజుల తర్వాత తన భర్తకు ఆపరేషన్ ​చేసి ఆ కాలును తొలగించారు. శస్త్ర చికిత్స తర్వాత వైద్య సిబ్బంది తొలగించిన ఆ కాలిని భాగ్యమ్మకు అందజేశారు. విషయం అర్థం కాని భాగ్యమ్మ ఆ కాలును చూసి కన్నీరు పెట్టుకుంది. ఆ కాలిని ఎక్కడైనా పాతి పెట్టమని సిబ్బంది అన్నారని ఆమె వాపోయింది. కాలిని పూడ్చేందుకు వేల రూపాయలను డిమాండ్​ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. ఈ విషయంపై కఠిన చర్య తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

బిర్యానీ లేదని దారుణం...
డిన్నర్​లోకి బిర్యానీ చేయలేదని ఓ భర్త తన భార్యపై అతి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని లాతూర్​ జిల్లాలో చోటు చేసుకుంది. విక్రమ్​ వినాయక్​ డేడే అనే వ్యక్తి తన భార్యతో నాందేడ్ రోడ్ ప్రాంతంలోని కుష్ట్​ధామ్​లో నివాసం ఉంటున్నాడు. ఆగస్టు 31న మద్యం మత్తులో విక్రమ్​ తూలుతూ ఇంటికి వచ్చాడు. తాగిన మైకంలో భార్యను బిర్యానీ చేయమని గొడవ చేశాడు. అయితే ఆమె చేయలేదని.. కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. అయితే విక్రమ్​ను ఇంతవరకు అరెస్ట్​ చేయలేదని పోలీసులు తెలిపారు.

ప్రేయసిని బెదిరించబోయి...
ప్రేయసితో వీడియో కాల్​ మాట్లాడుతూ 19 ఏళ్ల యువకుడు నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని శాంటాక్రూజ్​లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సాగర్​ పరశురామ్​ జాదవ్​ అనే యువకుడు తన గర్లప్రెండ్​తో వీడియో కాల్​ మాట్లాడుతున్నాడు. గణపతి పండల్‌ను సందర్శించిన తర్వాత ఆమె వేరే దారిలో వెళ్లడం గురించి గొడవపడటం మొదలుపెట్టాడు. గొడవ మధ్యలో ఆమెను బెదిరించేందుకు తనకు తాను నిప్పంటించుకున్నడానికి సిద్ధమయ్యాడు. అనుకోకుండా అతని చొక్కాకు నిప్పంటుకోగా.. మంటలు చెలరేగాయి. అప్పుడే వచ్చిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన మంటలు ఆర్పి అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 30 శాతం కాలిపోయిన సాగర్​కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడి స్టేట్​మెంట్ రికార్డు చేసుకున్నారు.

ఇదీ చదవండి:కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

అడిగినంత కుదరదు ఇచ్చినంత తీసుకోండి.. పోలవరంపై కేంద్రం

ABOUT THE AUTHOR

...view details