తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నకూతురుపై తండ్రి అత్యాచారం.. చంపేస్తానని బెదిరించి ఏడాదిన్నరగా.. - కన్న కూతురుపై తండ్రి రేప్​

Father Raped Daughter: రాజస్థాన్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడాదిన్నరగా పలుమార్లు కన్న కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. ఆపై ఎవరికైనా విషయాన్ని చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్​ చేశారు.

Father Raped Daughter:
Father Raped Daughter:

By

Published : Jul 9, 2022, 9:28 PM IST

Father Raped Daughter: తండ్రీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చే ఘటన రాజస్థాన్​లో జరిగింది. కన్నకూతురుపైనే ఏడాదిన్నరగా పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతక తండ్రి. మేనమామ సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది.. హనుమాన్​గఢ్​కు చెందిన బాధితురాలి తల్లి కొంతకాలం క్రితం చనిపోయింది. ఆ తర్వాత ఆమె అక్క, తమ్ముడు నానిహాల్​లో ఉన్న వారి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. అయితే బాధితురాల్ని కూడా మేనమామ తన ఇంటికి తీసుకు వెళ్దామనుకున్నాడు. కానీ ఆమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు. తాను ఒంటరిగా బతకలేనని చిన్నకుమార్తెను తన దగ్గరే ఉంచమని అన్నాడు. అందుకు మేనమామ అంగీకరించి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి బాధితురాలి ఆలనాపాలనాను బాగానే చూసుకునేవాడు తండ్రి. కానీ మరి ఏమైందో?.. ఏడాదిన్నర క్రితం బుద్ధి చెడి కన్నకూతురుపైనే అత్యాచారం చేయడం ప్రారంభించాడు. అలా పలుమార్లు పాల్పడ్డాడు. ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో ఆమె భయపడి ఎవరికీ చెప్పేది కాదు.

కొద్దిరోజుల క్రితం బాధితురాలి మేనమామ.. మళ్లీ హనుమాన్​గఢ్​ వచ్చాడు. తనతో బాధితురాల్ని పంపమని ఆమె తండ్రిని అడిగాడు. అందుకు అతడు మళ్లీ ఒప్పుకోలేదు. కానీ ఈ సారి బలవంతంగా తీసుకెళ్లాడు. మేనమామ ఇంటికి వెళ్లాక బాధితురాలు.. జరిగినదంతా చెప్పేసింది. వెంటనే అతడు బాధితురాల్ని తీసుకుని పల్లు పోలీస్​స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:ఫొటో ఇస్తానని ఇంటికి పిలిచి.. టెన్త్​ క్లాస్​ విద్యార్థినిపై గ్యాంగ్​ రేప్​

'నాకు ఇండియానే నచ్చింది'.. పోలీసులకు కృతజ్ఞతలు: బధిర యువతి గీత

ABOUT THE AUTHOR

...view details