తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్షుద్రపూజల పేరుతో కన్నకూతురిని చంపిన తల్లి!.. వంటగదిలోనే పూడ్చిపెట్టి.. - కరెంట్​ షాక్​ తగిలి నలుగురు బలి

క్షుద్రపూజల పేరుతో కన్నకూతుర్ని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టింది ఓ మహిళ. మూడు నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో ఇంట్లో గ్యాస్​లీకై మంటలు వ్యాపించగా.. ఆరు నెలల చిన్నారి మృతి చెందింది.

human sacrifice in aurangabad maharashtra
human sacrifice in aurangabad maharashtra

By

Published : Dec 15, 2022, 6:29 PM IST

మహారాష్ట్రలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షుద్రపూజల నెపంతో ఓ మహిళ తన కన్నకూతురిని హతమార్చినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఔరంగాబాద్​లోని వాలూజ్​ ప్రాంతంలో నివాసం ఉండే సూర్యకాంత్​ సెల్కే అనే వ్యక్తికి సొంతంగా కొన్ని ఇళ్లు ఉన్నాయి. అయితే అందులోని ఒక ఇంటిలో కాకాసాహెబ్​ నామ్​దేవ్​ భూయ్​గాడ్​ అనే వ్యక్తి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెలతో అద్దెకు ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం ఇంటి అద్దెను చెల్లించకుండా ఇల్లు ఖాళీ చేశాడు. దీంతో ఇంటి యజమాని సూర్యకాంత్​ అద్దె కోసం కాకాసాహెబ్​కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సూర్యకాంత్​ డిసెంబర్​ 14న ఇంటితాళం తీసి చూడగా.. అసలు విషయం బయటపడింది.

వంటగదిలో కొన్ని నిమ్మకాయలు, ఉప్పు, సింధూరం, ఓ రాయి ఉండటాన్ని గమనించాడు. కాకాసాహెబ్​ భార్య ఓ మాంత్రికురాలు కావడం వల్ల సూర్యకాంత్​కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి తవ్వకాలు జరపగా.. ఓ మృతదేహం బయటపడింది. శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాకాసాహెబ్​ ​ కుటుంబం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దాదాపు మూడు నెలల క్రితమే కాకాసాహెబ్​ భార్య.. చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

వీడియోల మోజులో పడి ముగ్గురు మృతి..
సోషల్​మీడియా రీల్స్​ మోజులో పడి.. ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైల్వేట్రాక్​పై వీడియోలు చేస్తున్న మహిళ, ఇద్దరు పురుషుల్ని ట్రైన్​ ఢీకొట్టింది. దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో బుధవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

మంటల్లో చిక్కుకొని.. మృతి చెందిన 6నెలల చిన్నారి..
ఉత్తర్​ప్రదేశ్​లో మంటల్లో చిక్కుకొని ఆరునెలల చిన్నారి మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో బుధవారం రాత్రి జరిగింది. డోరిలాల్​ భార్య రాజకుమారి.. తమ కుమారై దేవతి కావ్య కోసం గ్యాస్​పైన పాలు వేడిచేస్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా గ్యాస్​లీకై ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకొని ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి కావ్య మరణించింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన డోరిలాల్​, అతడి కుమారుడు రిషికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపుచేసి బాధితులను ఆస్పత్రికి తరలించారు.

కరెంట్​ షాక్​ తగిలి నలుగురు బలి..
మహారాష్ట్రలో నలుగురు వ్యక్తులు కరెంట్​ షాక్​కు బలయ్యారు. పుణెలోని బోరా ప్రాంతంలో గురువారం జరిగిందీ ఘటన. నదిలో విద్యుత్​ మోటర్ బిగిస్తుండగా.. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకొని రెండు మృతదేహాలను కనుగొన్నారు. మిగిలిన వాటికోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details