తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Dasara Navaratri 2023 Wishes : దసరా సందడి.. దూరంగా ఉన్న మనవాళ్లకు.. శుభాకాంక్షలు ఇలా చెప్పండి!

Dasara Navaratri 2023 Wishes : "పండగ" అంటే ఏంటి..? ఆచారాలు వ్యవహారాలు మాత్రమే కాదు.. అంతకన్నా ముఖ్యంగా అందరూ కలవడం..! బంధుమిత్రుల సందడితో ఇళ్లంత కళకళలాడడం..! కేరింతలు, తుళ్లింతలను మనసారా ఆస్వాదించండం..! కానీ.. ఆఫీసు పనుల్లో చిక్కుకొనో.. అనివార్య పరిస్థితుల కారణంగానో.. మనవాళ్లు కొందరు ఈ పండగ వేళ మనకు దూరంగా ఉండొచ్చు! వారు దగ్గరగా లేకపోతేనేం..? వారిపై ప్రేమను కురిపించే మన హృదయం ఉందిగా! మరోసారి కలుసుకుందామని చెబుతూ.. ఈ పండగవేళ మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయండి.

Dasara Navaratri Special Wishes and Quotes 2023
Dasara Navaratri Special Wishes and Quotes 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 12:37 PM IST

Dasara Navaratri 2023 Wishes :దేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే ఉత్సవాల్లో.. దేవీనవరాత్రులు ఒకటి. తొమ్మిది రోజులపాటు దుర్గామాతను పూజించి.. ఉపవాస దీక్షలు సైతం చేసి.. అమ్మవారిని కొలిచే పవిత్రమైన పండుగే దసరా. ఈ సంవత్సరం.. శరన్నవరాత్రులు 2023 అక్టోబర్ 15 నుంచి మొదలై.. అక్టోబర్ 24 మధ్య ముగుస్తున్నాయి. నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే విజయదశమిని తెలుగు రాష్ట్రాల్లో.. అక్టోబర్ 23న జరుపుకుంటున్నారు. క్యాలెండర్ 24వ తేదీ సూచిస్తున్నప్పటికీ.. పండితులు మాత్రం 23వ తేదీనే దసరా ఉత్సవాలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.

నవరాత్రుల ప్రాముఖ్యత(Importance of Navratri) :హిందూ మాసం అశ్విన్‌లో వచ్చే శార్దియ నవరాత్రిని.. భారతదేశం అంతటా.. శరన్నవరాత్రులుగా జరుపుకుంటారు. "నవరాత్రి" రాత్రిలో "నవ్" అంటే తొమ్మిది.. "రాత్రి" అంటే రాత్రులు అని అర్థం. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులపాటు అత్యంత నిష్టతో, భక్తిశ్రద్ధలతో దుర్గామాతకు పూజలు నిర్వహిస్తారు. పదవ రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. దుష్టులను దునుమాడి దుర్గాదేవి విజయం సాధించిన రోజు కనుక.. విజయదశమి అని కూడా పిలుస్తారు. రావణుడిపై.. శ్రీరాముడు విజయానికి సూచికగా కూడా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు.

మనవారికి శుభాకాంక్షలు తెలపండి (Dasara Greetings) :ఈ పండగ వేళ.. దగ్గరగా ఉన్న ఆత్మీయులు కలుసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. కొత్త దుస్తులు ధరించి.. మిఠాయిలు, పిండి వంటలు ఆరగిస్తూ.. ఆనందంగా జరుపుకుంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు నేరుగా తెలుపుకుంటారు. కానీ.. దూరంగా ఉన్నవారికి, ఈ పండగవేళ మన వద్దకు రాలేని వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అందుకే.. మీకోసం చక్కటి కోట్స్ తీసుకొచ్చాం. వీటితో మనవారికి శుభాకాంక్షలు తెలియజేయండి.

Best Recipes For Navratri Fasting 2023 : నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా..? అయితే.. ఇవి తినండి!

- దుర్గామాత దైవిక ఆశీర్వాదం.. మీ జీవితాన్ని నిత్యం ఆనందమయం చేస్తుంది. మీ జీవితం సంతోషాలతో నిండిపోవాలని ఆశిస్తూ.. విజయదశమి శుభాకాంక్షలు!

- ఈ నవరాత్రి.. మీ జీవితంలో నవక్రాంతిని నింపాలి. అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు!

- ఈ నవరాత్రులు.. మీపై నవగ్రహం బలం అద్భుతంగా పనిచేసేలా చూడాలని అమ్మవారిని వేడుకుంటూ.. మీకు ఆత్మబలాన్ని, ఐశ్వర్యాన్నీ ఆ దుర్గామాత ప్రసాదించాలని ఆశిస్తూ.. శరన్నవరాత్రి శుభాకాంక్షలు!

- ఈ పండుగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. మీకు ఎదురయ్యే చెడులన్నింటినీ.. దుర్గామాత ఆశీర్వాదంతో చీల్చి చెండాడుతూ ముందుకూ సాగాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు!

- ఈ విజయ దశమి.. వచ్చే ఏడాది వరకూ మీకు విజయాలనే అందించాలి. అడ్డంకులెన్ని ఎదురైనా.. విజయమే మీ గమ్యంగా సాగిపోవాలని ఆశిస్తూ.. విజయదశమి శుభాకాంక్షలు!

- ఈ పండగ సందడితో వెల్లి విరిసిన నవ్వుల పువ్వులు.. మీ జీవితాంతం పరిమళం వెదజల్లుతూనే ఉండాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు!

- ఈ నవరాత్రివేళ నువ్వు చేసిన పూజలు నీకు మరింత బలాన్ని చేకూర్చాయి. నీ భవిష్యత్తు ఎదురన్నదే లేకుండా ముందుకు సాగుతుందని ఆశిస్తూ.. దసరా శుభాకాంక్షలు.

- అద్వితీయమైన ఈ దసరా వేళ నువ్వు నా పక్కన లేవు. అయినా సరే.. నా హృదయం ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటుంది. మళ్లీ కలుసుకొని పండగ చేసుకుందాం. హ్యాపీ దసరా!

How to Check FASTag Balance : దసరా జర్నీలో అలర్ట్.. ఒక్క మిస్డ్​ కాల్​తో.. ఫాస్ట్​ట్యాగ్ బ్యాలెన్స్ చెక్​ చేసుకోండి..!

Thefts in Hyderabad During Dussehra : పండక్కి ఊరెళ్తున్నారా.. దొంగలు ఊడ్చేస్తారు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details