తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైసూరు దసరా కార్యక్రమంలో పాల్గొనే ఏనుగు మృతి.. కారణం ఇదే! - అడవి ఏనుగుల దాడితో మృతి చెందిన ఏనుగు

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. కారణం ఏంటంటే?

Dasara Jumbo Gopalaswamy dies
ఏనుగు మృతి

By

Published : Nov 24, 2022, 11:54 AM IST

మైసూరులో జరిగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దసరా కార్యక్రమంలో పాల్గొనే గోపాలస్వామి అనే ఏనుగు మృతి చెందింది. అడవి ఏనుగుల దాడితో అది ప్రాణాలు కోల్పోయింది. నాగరహోళే నేషనల్ పార్క్ సమీపంలోని కొలువిగె అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది.
ఈ ఏనుగును మంగళవారం నేరాలకుప్పె బి రివర్ క్యాంపు నుంచి ఆహారం కోసం అడవిలోకి విడుదల చేశారు అధికారులు. దీంతో అక్కడి అడవి ఏనుగులు దానిపై దాడి చేశాయి.

మృతి చెందిన ఏనుగు

అడవి నుంచి ఏనుగు శబ్దం వినిపించగా.. స్థానికులు వెళ్లి చూశారు. అప్పటికే ఏనుగు తీవ్ర రక్తస్రావంతో పడి ఉంది. దాన్ని గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి నలుగురు వైద్యుల బృందం అన్ని రకాల చికిత్సలు అందించారు. అయితే, చికిత్స ఫలించక బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మృతి చెందింది.

మృతి చెందిన ఏనుగు

డీసీఎఫ్ హర్షకుమార్ చిక్కనరగుండ, ఏసీఎఫ్ దయానంద్ సహా అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బుధవారం సాయంత్రం కొలువిగె దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు.

మృతి చెందిన ఏనుగు

ఇవీ చదవండి:ఇష్టం లేని చదువుకు విద్యార్థి బలి.. సుసైడ్​ నోట్​లో 'తల్లిదండ్రులకు సారీ'

నమ్మకంగా ఉన్నారు.. అదును చూసి దోచేశారు..

ABOUT THE AUTHOR

...view details