తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దళిత మహిళపై గ్యాంగ్ రేప్.. భర్త ఎదురుగానే... - మధ్యప్రదేశ్‌ మహిళలపై అత్యాచార గణాంకాలు

ఓ దళిత మహిళపై ముగ్గురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త ఎదురుగానే కిరాతకంగా ప్రవర్తించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

rape
రేప్

By

Published : Oct 15, 2021, 10:35 AM IST

మధ్యప్రదేశ్‌ శివపురి జిల్లాలోని అటవీ ప్రాంతంలో దళిత మహిళపై ముగ్గురు ఉన్మాదులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె భర్త సమక్షంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

బైక్​పై వచ్చి దాడి..

బాధిత దంపతులు అడవిలో వంట చెరుకు సేకరిస్తున్న క్రమంలో.. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఓ ప్రదేశాన్ని చూపించి అక్కడ కలపను సేకరించాల్సిందిగా ఆదేశించారు. అయితే.. ప్రస్తుతం సేకరించిన కర్రలు తమకు సరిపోతాయని.. ఇంకా సేకరించలేమని దంపతులు జవాబిచ్చారు.

దీనితో ఆగ్రహం చెందిన ఆ ముగ్గురు దంపతులపై దాడికి దిగారు. ఈ ఘటనలో మహిళ చేయి విరిగిపోయిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్ సింగ్ తెలిపారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వారిని వదిలేయాలని చెప్పగా అతడిని తన్ని తరిమేశారు నిందితులు. అనంతరం ఆ ముగ్గురూ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details