Rajasthan Dalit women Rape: రాజస్థాన్ ధోల్పుర్లో దారుణం జరిగింది. దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు.
'బాధితురాలు తన భర్త, పిల్లలతో కలిసి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. నిందితులు దంపతులను అడ్డగించి కొట్టారు. ఆమె భర్తను తుపాకీతో కాల్చారు. ఆ తర్వాత బాధితురాలిని.. ఆమె పిల్లల ముందే తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు'అని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు, బాధిత మహిళ ఒకే గ్రామానికి చెందిన వారని తెలిపారు.
నిందితులు లాలూ ఠాకూర్, ధన్ సింగ్ ఠాకూర్, విపిన్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్, సచిన్ ఠాకూర్, లోకేంద్ర సింగ్ ఠాకూర్‌లుగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉందని, ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని చెప్పారు.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం
Ayodhya minor rape: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ అయోధ్య కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు.
దాగుడుమూతలు ఆడుతుండగా..
'బాలిక సహచర చిన్నారులతో కలిసి దాగుడుమూతలు ఆడుతుండగా.. నిందితుడు బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. అనంతరం చిన్నారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబానికి సమీపంలో బాలిక ఆచూకీ లభించగా.. ఆస్పత్రికి తరలించాం. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు తేలింది. బాలిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.' అని పోలీసులు తెలిపారు.
నిందితున్ని రాజన్ మాంఝీగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:హిజాబ్ వివాదం.. కర్ణాటకలో బంద్.. దుకాణాల మూసివేత