Two Dalit Sisters Hanging : ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేపడుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం..నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను ఆరుగురు నిందితులు.. గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు కలిపి.. వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమను పెళ్లి చేసుకోవాలని బాధితురాళ్లు బలవంతం చేశారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్ల మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అనుమానం రాకుండా ఉండేందుకే.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పట్టపగలే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారని వారి తల్లి చెప్పింది. అయితే తమ పిల్లలను నిందితులు.. అత్యాచారం చేసి హత్య చేశారని, అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు చెట్టుకు వేలాడదీశారని ఆరోపించింది. దాంతో పాటు అనుమతి లేకుండా మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించారని బాధితురాళ్ల తండ్రి వాపోతున్నారు.
ఉన్నత స్థాయి విచారణకు ఎస్పీ డిమాండ్..
ఇద్దరు దళిత సోదరీమణుల మృతదేహాలు లభ్యమైన ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ.. యోగి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
మైనర్‌పై మేనమామ అత్యాచారం..
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో దారుణం జరిగింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో మైనర్‌పై పలుమార్లు అత్యాచారం చేశాడు ఆమె మేనమామ. బాలిక అసౌకర్యాన్ని స్థానిక ఆశావర్కర్ గుర్తించడం వల్ల అతడి దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం..జిల్లాలోని కడబ ప్రాంతానికి బాధితురాలు(17).. తొమ్మిదో తరగతితో చదువు ఆపేసి తన మేనమామ రుక్మయ్య(31) ఇంట్లో గత మూడేళ్లగా ఉంటోంది. ఫిబ్రవరి నెలలో అందరూ నిద్రిస్తున్న సమయంలో డ్రాయింగ్ రూమ్‌కు బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. మేనమామ మాటలకు భయపడిన బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.