తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దళిత యువకుడి హత్య.. కాంగ్రెస్​కు కేంద్ర మంత్రి చురకలు! - కుల హత్యలు

ప్రేమ వ్యవహారంలో ఓ దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొంతమంది ఆ యువకుడిని కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్​లో జరిగిన ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​.. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Dalit man beaten to death
దళిత యువకుడు హత్య

By

Published : Oct 10, 2021, 8:04 AM IST

రాజస్థాన్​లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని ప్రేమించినందుకు దళిత యువకుడిని కొంతమంది కర్రలతో కొట్టి చంపారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో అక్టోబర్​ 7న ఈ ఘటన జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

యువకుడు ప్రాణాలుపోయేవరకు కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిందితులు వీడియోను కూడా చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని అతని నివాసం బయట పడేసినట్లు చెప్పారు.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంపై ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

"రాహుల్​జీ.. లఖింపుర్​ ఘటన గురించి మీరు బాధపడకండి. ఆ విషయాన్ని.. యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్​ చూసుకుంటారు. మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్​లోని ప్రేమ్​పురాలో దళిత యువకుడిని హత్య చేశారు. దీని గురించి ముఖ్యమంత్రి గెహ్లోత్​ మాట్లాడాలి. కనీసం మాట్లాడే ధైర్యమైనా చేయండి. ఇలా చేయడం వల్ల ఎవరు నిజాయితీపరులో ప్రజలు తెలుసుకుంటారు."

-గజేంద్ర షెకావత్​, కేంద్ర మంత్రి

ఈ ఘటనకు సంబంధించి.. నిందితులను పోలీసులు పట్టుకోవాలని కోరుతూ.. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇదీ చూడండి:'3వేల కిలోల డ్రగ్స్'​ కేసులో కీలక పత్రాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details