తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైద్యుడితోనైనా బాక్సింగ్‌ చేసేంత బలంగా ఉన్నా' - dalailama health

Dalai Lama: కొవిడ్​ ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత బౌద్ధమత గురువు దలైలామా బయటకు వచ్చారు. ధర్మశాలలోని బౌద్ధ ఆలయంలో శుక్రవారం భక్తులకు తన బోధనలు వినిపించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం దిల్లీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ తన ఆరోగ్యం బాగున్నందున వెళ్లలేదన్నారు. వైద్యుడితోనైనా బాక్సింగ్ చేసేంత బలంగా ఉన్నానని తెలిపారు.

dalailama
దలైలామా

By

Published : Mar 19, 2022, 7:43 AM IST

Dalai Lama: కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత బౌద్ధమత గురువు దలైలామా తొలిసారి బయటకు వచ్చారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్న ఆయన.. వైద్యుడితో బాక్సింగ్‌ కూడా చేయగలనంటూ చమత్కరించారు.

ధర్మశాలలోని బౌద్ధ ఆలయంలో దలైలామా

ధర్మశాలలోని బౌద్ధ ఆలయంలో శుక్రవారం భక్తులకు తన బోధనలు వినిపించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం దిల్లీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ తన ఆరోగ్యం బాగున్నందున వెళ్లలేదన్నారు. తాను వైద్యుడితోనైనా బాక్సింగ్‌ చేసేంత బలంగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది టిబెటిన్లతో పాటు సన్యాసులు, సెంట్రల్‌ టిబెటన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీటీఏ) సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీటీఏ సభ్యుడు టెంజింగ్‌ జిగ్మే మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్ల తర్వాత దలైలామాను చూసిన ఈ రోజు తమకెంతో అందమైనదిగా పేర్కొన్నారు. ఆయన క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉండటం అదృష్టమన్న జిగ్మే.. దలైలామా దీర్ఘాయువు కోసం ప్రార్థించినట్టు తెలిపారు.

ఇదీ చదవండి:డాక్టర్ 'సరోగసి'​ చీటింగ్​.. హైదరాబాద్​ దంపతులకు టోకరా!

ABOUT THE AUTHOR

...view details