తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్స్.. మహీంద్ర ఎస్​యూవీలు అందించిన సంస్థ - ఉద్యోగులు మహీంద్ర కార్ గిఫ్ట్

Mahindra cars to employees: సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది ఓ కంపెనీ. మొత్తం 12 మందికి మహీంద్ర ఎస్​యూవీలు అందజేసింది. గురు పూర్ణిమ రోజు కార్లను అందుకున్నారు ఉద్యోగులు. ఈ సమయంలో కొందరు కంటతడి పెట్టారు.

Mahindra cars to employees
Mahindra cars to employees

By

Published : Jul 16, 2022, 4:25 PM IST

Mahindra car gifts to employees: గురు పూర్ణిమ పండుగను మహారాష్ట్రలోని ఓ సంస్థ ప్రత్యేకంగా నిర్వహించింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్లను కానుకగా ఇచ్చింది. మొత్తం 12 మంది ఉద్యోగులకు 'మహీంద్ర ఎస్​యూవీ 300'లను బహూకరించింది. నాశిక్​కు చెందిన 'డెయిరీ పవర్' అనే సంస్థ ఉద్యోగులకు ఇలా సర్​ప్రైజ్ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి కార్లను స్వీకరించారు ఉద్యోగులు. ఈ సమయంలో కొందరు కంటతడి పెట్టారు. మహీంద్ర ఎస్​యూవీ 300 వేరియంట్ ధర ప్రస్తుతం రూ.12లక్షల 60వేలుగా ఉంది. మొత్తం 3 రంగుల్లో ఉన్న కార్లను ఉద్యోగులకు ఇచ్చారు.

మహీంద్ర కారు కీని అందిస్తున్న సంస్థ యాజమాన్యం
మహీంద్ర కార్లు

పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించిన రంగంలో పని చేస్తోందీ 'డెయిరీ పవర్'. ఉద్యోగులే సంస్థకు గురువులని.. అందుకే గురు పూర్ణిమ రోజున వారి సేవలకు గుర్తింపుగా కార్లు అందించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు దీపక్ అవ్హాద్ తెలిపారు. ఉద్యోగులంతా ఎన్నో ఏళ్లుగా సంస్థలో నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పారు. 'నా కంపెనీలో పనిచేస్తున్న వారంతా ఇల్లు, కారు కొనుక్కునే స్థితిలో ఉండాలని అనుకుంటూ ఉంటా. వీరి సేవలకు ప్రతిఫలంగా నేనే కార్లు ఇవ్వాలని భావించా. గురు పూర్ణిమను ఓ అవకాశంగా భావించి వాహనాలు అందించా. సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉద్యోగులకు నా కృతజ్ఞతలు' అని వివరించారు.

ఉద్యోగులకు అందించిన మహీంద్ర కార్లు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details