మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 10 సంవత్సరాల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సుమారు నాలుగు నెలలుగా ఈ అఘాయిత్యానికి ఒడికడుతూ వచ్చిన తండ్రిని రాజస్థాన్‌లోని దాబి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని స్థానిక కోర్టులో హజరుపరచనున్నారు.
ఇదీ జరిగింది..
నిందితుడు పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్‌లోని దాబీకి తరలివచ్చాడు. కుటుంబ కలహాలతో భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు. తనతో ఉన్న 10ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందువల్ల చిన్నారికి పొత్తి కడుపులో భరించలేని నొప్పి కలిగింది. దీంతో బాలిక చుట్టుపక్కల వారిని ఆశ్రయించింది. ఈక్రమంలో స్థానికులకు అనుమానం రాగా గ్రామ సర్పంచ్‌కు.. జరిగింది వివరించారు. దీనిపై దాబీ పోలీసులకు సర్పంచ్ ఫిర్యాదు చేశారు. కీచక తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు, చిన్నారిని.. బాలికల సంరక్షణ గృహానికి తరలించారు.