తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలీ అకౌంట్​లో రూ.100 కోట్లు జమ.. నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఆఖరికి.. - అక్రమంగా బంగాల్ కూలీకి డబ్బులు

బంగాల్​లో ఓ దినసరి కూలీ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో అతడికి పోలీసుల నుంచి నోటీసులు అందాయి. అప్పుడు ఆ కూలీ ఏం చేశాడో? అతడు పడుతున్న ఇబ్బందులు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.

Daily labourer gets Rs 100 crore credited
Daily labourer gets Rs 100 crore credited

By

Published : May 25, 2023, 8:29 AM IST

Updated : May 25, 2023, 8:37 AM IST

మనకు తెలియకుండానే ఒక్కొసారి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతుంటాయి. బ్యాంక్​ల సాంకేతిక కారణాల వల్ల ఇలా జరుగుతుంటుంది. ఆ డబ్బుల్ని మళ్లీ బ్యాంక్​ అధికారులు మన నుంచి స్వాధీనం చేసుకుంటారు. అయితే బంగాల్​కు చెందిన ఓ దినసరి కూలీ బ్యాంక్ అకౌంట్​లో ఏకంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఏం చేయాలో ఆ కూలీకి అర్థంకాక తికమకపడ్డాడు. అప్పుడు ఏం జరిగిందంటే..

దేగంగాలోని వాసుదేవ్​పుర్​కు చెందిన మహ్మద్ నసీరుల్లా(26) వ్యవసాయ కూలీ. అతడికి తల్లిదండ్రులతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నసీరుల్లా సంపాదనతోనే ఆ కుటుంబం గడుస్తోంది. నసీరుల్లాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి అప్పుడప్పుడు నసీరుల్లా లావాదేవీలు జరిపేవాడు. అందులో కేవలం రూ.17 మాత్రమే ఉంది. అయితే ఇటీవల ఆయన అకౌంట్​లో రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆయనకు జంగీపుర్ సైబర్ క్రైమ్​ పోలీసులు నోటీసులు పంపారు. మే 30 లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ డబ్బులు ఎవరు నసీరుల్లా బ్యాంకు ఖాతాలో వేశారనే విషయాన్ని కనుగొనడంలో పోలీసులు నిమగ్నమయ్యారు.

పోలీసులు నోటీసులు జారీ చేయడం వల్ల నసీరుల్లా భయపడుతున్నాడు. ఇంత డబ్బు తన ఖాతాలోకి ఎలా వచ్చిందో అర్థం కాక తలపట్టుకున్నాడు. తనకు అకౌంట్​ ఉన్న బ్యాంక్​ను సంప్రదించిన జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో బ్యాంకు అధికారులు నసీరుల్లా బ్యాంక్ అకౌంట్​ను బ్లాక్ చేశారు.

"నేను దినసరి కూలీని. వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపారు. వాటిని ఓ చదువుకున్న యువకుడితో చదివించా. రూ. 100 కోట్ల నా బ్యాంకు ఖాతాలోకి వచ్చిందని అందులో ఉంది. ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు పట్టుకుని పోలీసుల ఎదుట హాజరుకావాలని ఉంది. చాలా భయంగా ఉంది. అసలు ఆ డబ్బులు ఎలా నా బ్యాంక్ అకౌంట్​లోకి వచ్చాయో నాకు తెలియదు."

--మహ్మద్ నసీరుల్లా, దినసరి కూలీ

100 మంది ఖాతాల్లో రూ.13 కోట్ల జమ..
గతేడాది మేలో తమిళనాడు చెన్నైలోని టీనగర్​ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. తమ మొబైల్​ ఫోన్​లకు వచ్చిన మెసేజ్​లు చూసి అవాక్కయ్యారు. తమ ఖాతాలో రూ.13 కోట్లు జమ అయి ఉండడం చూసి షాక్​ అయ్యారు. వారిలో కొంతమంది ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. మరికొందరు సైలంట్​గా ఉన్నారు. అప్పుడు బ్యాంక్ అధికారులు ఏం చేశారంటే?.. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : May 25, 2023, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details