కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అంబులెన్స్ సేవల కోసం అభ్యర్థనలు పెరిగిపోతున్నాయి. రోజుకు కనీసం 9,000కు పైగా ఫోన్లు వస్తున్నాయని కంట్రోల్ రూమ్ మేనేజర్ డాక్టర్. ప్రవీణ్ సాధలే తెలిపారు. దీనిని బట్టి అక్కడ కరోనా కేసుల ఉద్ధృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
"రోజుకు 9,000-10,000 కాల్స్ వస్తున్నాయి. వీటిలో కొవిడ్ అత్యవసర బాధితులే ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు ఇతరులూ ఉన్నారు. రోగుల్లో ఇప్పుడు భయం పెరిగింది."
-డాక్టర్ ప్రవీణ సాధలే, కంట్రోల్ రూమ్ మేనేజర్
మహారాష్ట్ర అంతటా సుమారు 937 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచినట్లు డాక్టర్ ప్రవీణ సాధలే తెలిపారు. వీటిల్లో రోగులకు అవసరమైన పీపీఈ కిట్‌ల ఏర్పాటు సహా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.