తెలంగాణ

telangana

ETV Bharat / bharat

BJP Purandeshwari's comments: వైసీపీకి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి - Purandeshwari comments on YSRCP

BJP state president Purandeshwari's comments: రాష్ట్రాన్ని పాలించే అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో మద్యంలో భారీ ఎత్తున కుంభకోణం, పెద్ద ఎత్తున భూ దోపిడీ జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఏపీలో ఇసుక మాఫియా అరాచకం సృష్టిస్తోందని, భవన నిర్మాణ రంగం కుదేలైందని పేర్కొన్నారు. జనసేనతో సమన్వయం చేసుకుంటాం అని పురందేశ్వరి ప్రకటించారు.

బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వికరిస్తున్న పురందేశ్వరి
బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వికరిస్తున్న పురందేశ్వరి

By

Published : Jul 13, 2023, 1:20 PM IST

Updated : Jul 13, 2023, 6:05 PM IST

వైసీపీకి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు : పురందేశ్వరి

BJP state president Purandeshwari's comments: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. బీజేపీపై రాష్ట్రంలో దుష్ప్రచారం నడుస్తోందన్న ఆమె.. ఏపీలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో పార్టీలతో పొత్తుల వ్యవహారం అధినాయకత్వం చూసుకుంటుందని, పవన్‌కల్యాణ్‌తో నిన్న, మొన్న ఉన్నాం.. రేపూ ఉంటాం అని స్పష్టం చేశారు. జనసేనతో సమన్వయం చేసుకుంటాం అని పురందేశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలో వైఎస్సార్సీపీ పాలనపై పురందేశ్వరి నిప్పులు చెరిగారు. మద్యంలో భారీ ఎత్తున కుంభకోణం జరుగుతోందని, ఇసుక మాఫియా అరాచకం సృష్టిస్తోందని, రాష్ట్రంలో భూదోపిడీ పెద్దఎత్తున జరుగుతోందని చెప్తూ.. ఏపీని పాలించే అధికారం వైఎస్సార్సీపీకి లేదని అన్నారు.

కేంద్రం నిధులతో పనులు... ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి బీజేపీ సహకరిస్తోందని పురందేశ్వరి తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6 వేలు ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయని తెలిపారు. రైతులకు రూ.12,500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైందని పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చిందన్న పురందేశ్వరి.. కనీసం 30 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తికాలేదని మండిపడ్డారు. ఇళ్లిస్తామని పేదలకిచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వ సమాధానమేంటి? అని ప్రశ్నించారు. జాతీయ రహదారుల నిర్మాణం తప్ప ఏపీలో నూతన నిర్మాణాలు లేవని, రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు.. ఉన్న పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలో ఉపాధి హామీ నిధులే ఉన్నాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన.. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అధికార పార్టీ అరాచకాలపై పురందేశ్వరి మండిపడ్డారు. బాపట్ల జిల్లా రాజోలులో పదో తరగతి విద్యార్థి అమర్​నాథ్ ను పెట్రోల్ పోసి చంపేశారని, విశాఖలో అధికార పార్టీ ఎంపీ ఇంట్లో కిడ్నాపర్లు 2 రోజులున్నా.. శాంతి భద్రతల మాటేమిటని ప్రశ్నించారు. దశలవారీ మద్య నిషేధం హామీ సంగతేంటి? అని పురందేశ్వరి సూటిగా ప్రశ్నించారు. నాణ్యత లేని మద్యం సరఫరా చేస్తున్నా పట్టించుకోవట్లేదని, మద్యంలో భారీ ఎత్తున కుంభకోణం జరుగుతోంది పురందేశ్వరి ఆరోపించారు. ఏపీలో ఇసుక మాఫియా అరాచకం సృష్టిస్తోందని, రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని తెలిపారు. భూదోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందన్న ఆమె.. ఏపీని పాలించే అధికారం వైఎస్సార్సీపీకి లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేలు కంటే ఎక్కువ మేలే కేంద్రం చేస్తోందని, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పోలవరం నిర్వాసితుల విషయంలో రాష్ట్రానికి క్లారిటీ లేదన్న పురందేశ్వరి.. నిర్వాసితులపై రాష్ట్రానికి క్లారిటీ వస్తే కేంద్రం దృష్టి సారిస్తుందని అన్నారు.

Last Updated : Jul 13, 2023, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details