Dadi Veerabhadra Rao Resigns To YSRCP:వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల స్థానాల్లో మార్పులను చేపట్టింది. అంతేకాకుండా శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోటీ చేసే అభ్యర్థులను కూడా మారుస్తూ వస్తోంది. ఈ క్రమంలో పార్టీ చర్యల ప్రభావంతో కొందరు నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మాజి మంత్రి వైఎస్సార్సీపీ పార్టీని వీడారు. ఈ మేరకు ఆయన అధిష్టానానికి లేఖ పంపించారు.
అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైెఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను, పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. అంతేకాకుండా తన రాజీనామా లేఖను వైఎస్సార్సీపీ పార్టీ ఆగ్ర నేతలకు పంపించినట్లు సమాచారం.
వైసీపీలోని గ్రూపు తగాదాల వల్లే మంత్రి రజని కార్యాలయంపై దాడి: టీడీపీ నేతలు
మాజీ మంత్రి దాడి మాత్రమే కాకుండా ఆయన కుమారులు రత్నాకర్, జయవీర్ కూడా పార్టీని వీడుతున్నట్లు లేఖలో పార్టీ అధిష్ఠానానికి వివరించారు. అయితే వైఎస్సార్సీపీని వీడిన ఈ నేతలు, ఏ పార్టీలో చేరతారనే అంశం అనకాపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దాడి వీరభద్ర రాజీనామాకు ముందు తన అనుచరులు, కార్యకర్తలు శ్రేణులతో సమావేశమైనట్లు సమాచారం. వారితో చర్చలు జరిపిన తర్వాతనే వైఎస్సార్సీపీని వీడినట్లు తెలుస్తోంది. అయితే ఆయన త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం ఉందని ప్రచారం సాగిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉందని సమాచారం.