Dacoit Kalli Gurjar in Morena: మధ్యప్రదేశ్ చంబల్ ప్రాంతంలో బందిపోట్లు.. కిడ్నాప్‌లు, దోపిడీలు, దొంగతనాలు వంటివి చేస్తారని చాలా సార్లు వినేవుంటారు. కానీ, ఓ బందిపోటు దొంగ తన వృత్తికి సంబంధం లేని ఓ కొత్త పని చేసి వార్తల్లో నిలిచాడు. తన మనసు దోచిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తన బలాన్ని చూపించాడు. యువతి ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని చితకబాది పెళ్లి చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి కూతుర్ని ఇస్తావా లేదా చస్తావా? అంటూ బెదిరించాడు.
ఇదీ జరిగింది:కల్లి గుర్జార్ అనే బందిపోటు దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే వెతుకుతున్నారు. అతడిపై రూ.15వేల రివార్డ్ సైతం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఓ యువతి కల్లి గుర్జార్ మనసును దోచుకుంది. ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడు. పెళ్లి చేసుకోవాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. కానీ, ఆ యువతి తండ్రి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించాడు. ఈ విషయం తెలుసుకున్న కల్లి గుర్జార్ ఆగ్రహంతో ఊగిపోయాడు. గురువారం రాత్రి యువతి ఇంటికి తన గ్యాంగ్‌తో వెళ్లాడు. ఆమె తండ్రిని చితకబాదాడు. కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత గ్రామస్థులను భయపెట్టేందుకు కాల్పులు సైతం జరిపాడు.