తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యాహ్నం తీరం దాటనున్న 'యాస్'​ తుపాను

అతి తీవ్ర తుపాను యాస్​.. తీరానికి చేరువైంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలేశ్వర్​​ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. తీరం దాటే సమయంలో 130-140 కి.మీల వేగంతో ప్రఛండ గాలులు వీస్తాయని చెప్పింది.

CycloneYaas
మధ్యాహ్నం తీరం దాటనున్న 'యాస్'​ తుపాను

By

Published : May 26, 2021, 7:35 AM IST

Updated : May 26, 2021, 12:11 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్​.. తీరానికి చేరువైంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలేశ్వర్​​ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. యాస్​ తుపాను.. ఒడిశాలోని ధామ్రాకు 60 కి.మీ.ల దూరంలో, పారదీప్​కు 90కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఆ రాష్ట్రంలోని బాలేశ్వర్​​కు 105 కి.మీల దూరంలో, బంగాల్ దిఘాకు 240 కి.మీల దూరంలో ఉన్నట్లు చెప్పింది.

ఒడిశా ధామ్రాలో భారీగా కురుస్తున్న వర్షాలు
ధామ్రాలో వర్షపాతం

తుపాను భూమిని తాకుతున్న దృష్ట్యా.. ఒడిశా, బంగాల్​, ఝార్ఖండ్​లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి మధ్యస్థ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. ప్రభావిత ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

''తుపాను ప్రభావిత ప్రాంతాలైన భద్రక్​, జగత్​సింగ్​పుర్​, కటక్​, బాలేశ్వర్​​, దేన్​కనల్​, జైపుర్​, మయూర్​బంజ్​, కేంద్రపుర, కియోంజగఢ్​ వంటి కొన్ని ప్రాంతాల్లో బుధవారం, గురువారం.. అతి భారీ వర్షాలు కురుస్తాయి.''

-ఐఎండీ

తాము బుధవారం మధ్యాహ్నానికి ఈ తుపాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నామని ఐఎండీ భువనేశ్వర్​కు చెందిన సీనియర్​ శాస్త్రవేత్త ఉమాశంకర్​ దాస్​ తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో 130 నుంచి 140 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.

బంగాల్​ దిఘాలో ఎగిసి పడుతున్న సముద్రం
యాస్​ తుపాను ధాటికి దిఘాలో భారీ వర్షాలు

తుపాను దృష్ట్యా ఒడిశా, బంగాల్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని.. 11లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:అతి తీవ్ర తుపానుగా 'యాస్'

Last Updated : May 26, 2021, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details