తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు

బంగాల్​, ఒడిశా రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో యాస్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఒడిశాలోని ధామ్రా వద్ద తుపాను తీరాన్ని తాకిందని ఐఎండీ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఉత్తర ఒడిశా, బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

yaas cyclone effect
యాస్​ తుపాను ఉగ్రరూపం

By

Published : May 26, 2021, 12:59 PM IST

Updated : May 26, 2021, 1:30 PM IST

'యాస్' ఉగ్రరూపం

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను.. తీవ్రరూపం దాల్చింది. భీకర గాలులు, భారీ వర్షాలతో మొదలైన తుపాను.. క్రమంగా బలపడి ఒడిశా, బంగాల్​లోని తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఒడిశా భద్రక్​ జిల్లా ధామ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది.

ధ్రామ్రా వద్ద..

రహదారిపై కూలిన చెట్టు
రహదారులను ముంచెత్తిన నీరు
నీట మునిగిన వాహనాలు

ఒడిశాలోని ధామ్రా వద్ద తుపాను తీరాన్ని తాకిందని ఐఎండీ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఉత్తర ఒడిశా, బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుపాను ధాటికి ఝార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం ఉదయం కల్లా తుపాను ఝార్ఖండ్​ చేరుకుంటుందని ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు.

ఇద్దరు మృతి..

జలమయం
నీట మునిగిన ఇళ్లు
నివాసిత ప్రాంతాల్లో నీరు
నివాసిత ప్రాంతాల్లోకి సమద్ర నీరు

యాస్ తుపాను ప్రభావానికి ఆనంద్​పుర్​, బాలేశ్వర్ ప్రాంతాల్లో చెట్టు కూలి ఇద్దరు మృతి చెందారు.

నివాసిత ప్రాంతాలు జలమయం

తుపాను ధాటికి బంగాల్​లోని తూర్పు మిడ్నాపుర్ వద్ద ఉన్న నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఇళ్లు, పంటపొలాలు దెబ్బతిన్నాయి. 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. తుపాను దృష్ట్యా ఒడిశా, బంగాల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు ఉన్నాతాధికారులు. బంగాల్‌లో 74 వేల మంది సిబ్బంది, 2 లక్షల మంది పోలీసులను మోహరించారు. యాస్ తుపాను ధాటికి బంగాల్​లోని కపిళముని దేవాలయం నీటమునిగింది.

విమాన సర్వీసులు రద్దు..

వరదలో కొట్టుకుపోతున్న లేగదూడను రక్షిస్తున్న యువకుడు
యాస్ విధ్వంసం
నీట మునిగిన ఇల్లు

యాస్ తుపాను కారణంగా దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగాల్, ఒడిశాలకు వెళ్లే పలు విమానాలను రద్దు చేశారు. అయితే మిగతా విమాన సర్వీసులు షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని విమానాశ్రయం అధికారులు తెలిపారు. రేపు సా. 5 గంటల వరకు భువనేశ్వర్‌ విమానాశ్రయం మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి :యాస్ తుపాను: చెట్టు కూలి ఇద్దరు మృతి

Last Updated : May 26, 2021, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details