దేశ తూర్పు తీరంపై విరుచుకుపడుతున్న యాస్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఈ ఉదయం 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే బంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన ఈ తుపానుకు ఇప్పుడు 'పున్నమి' కూడా తోడైంది. దీంతో తీరం దాటినా కూడా మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
ఈ రోజు పౌర్ణమి.. దీనికి తోడు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ సమయంలో అలల ఉద్ధృతితో సముద్రం మరింత అల్లకల్లోలంగా మారే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో తీర ప్రాంతాల్లో తుపాను పెను బీభత్సం సృష్టించనుందని హెచ్చరించారు. బంగాల్లోని ఐదు సబ్ డివిజన్లు, ఒడిశాలోని నాలుగు బ్లాక్లు నీట మునిగే ప్రమాదముందన్నారు.
సాధారణంగా జాబిల్లి భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సూపర్మూన్ కన్పిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు విపరీతంగా ఉంటాయి. అలలు గరిష్ఠ ఎత్తులో ఎగసిడుతుంటాయి. ఇక చంద్రగ్రహణం కూడా ఇదే రోజున ఉంది. భారత్లో బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి చంద్రగ్రహణం మొదలవనుంది. దీంతో ఈ సాయంత్రం తీర ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
పెనుగాలుల బీభత్సం..