తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళకు 'తౌక్టే' ముప్పు- రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​ - కేరళ వర్షాలు

'తౌక్టే' తుపాను నేపథ్యంలో కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవచ్చన్న హెచ్చరికలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర, లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించి.. సహాయ శిబిరాలను ప్రారంభించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Cyclone 'Tauktae': NDRF earmarks 53 teams for five states
కేరళను వణికిస్తున్న 'తౌక్టే' తుపాను.. అప్రమత్తమైన ప్రభుత్వం

By

Published : May 14, 2021, 5:53 PM IST

Updated : May 15, 2021, 10:03 PM IST

భారత్​లో ఈ ఏడాది వచ్చిన మొదటి తుపాను 'తౌక్టే'ను ఎదుర్కొనేందుకు కేరళ సిద్ధమైంది. రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూసేందుకు తీరం వెంబడి సిబ్బందిని మోహరించారు అధికారులు. సముద్ర తీరం సహా.. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. తుపాను ధాటికి ఇప్పటికే కొల్లం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా.. వందలకొద్దీ ఇళ్లు దెబ్బతిన్నాయి.

కేరళలో వర్షం దృశ్యాలు

కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. కొండచరియలు ఎక్కువగా ఉన్న వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎన్​డీఆర్​ఎఫ్ అధికారులు తెలిపారు. పునరావాస శిబిరాల్లో కరోనా నిబంధనలన్నీ పాటిస్తున్నట్లు చెప్పారు. అయితే.. సహాయ శిబిరాలకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.

కేరళలో వర్షం దృశ్యాలు

'తౌక్టే' తుపానును ఎదుర్కొనేందుకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలలో 53 బృందాలను మోహరించినట్లు ఎన్​డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ ఎన్ ప్రధాన్ తెలిపారు.

ఇవీ చదవండి:రానున్న రెండురోజులు కేరళలో కుండపోతే!

Last Updated : May 15, 2021, 10:03 PM IST

ABOUT THE AUTHOR

...view details