షహీన్ తుపాను(cyclone shaheen news) బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా కర్ణాటకలో భారీ వర్షాలు(Heavy rains in Karnataka) కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి(Floods in Bengaluru). ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బెంగళూరులో భారీ వృక్షాలు నెలకొరిగి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని తుముకూర్ రోడ్, మైసూర్ రోడ్, బళ్లారి రోడ్, మెజెస్టిక్, ఛామరాజపేట్, బసవన్నగుడి, యశ్వంతపుర్, రాజరాజేశ్వరీ నగర్, మహదేవపుర, హెబ్బల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యి.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కేఆర్ పురా, మహదేవపుర, హోస్కెట్, రాజరాజేశ్వరీ నగర్లో 90-98 మిల్లీమీటర్ల మేర వర్షపాతం(Heavy rains) నమోదైంది. అక్టోబర్ 6 వరకు బెంగళూరుపై షహీన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.