తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గల్లంతైన నౌకల్లోని 177మందిని రక్షించిన నేవీ - తౌక్టే తుపాను

ముంబయిలో తౌక్టే తుపాను బీభత్సానికి రెండు వ్యాపార నౌకలు కొట్టుకుపోయి.. 410మంది గల్లంతైన ఘటనలో 177 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

Navy ships
యుద్ధనౌకలు

By

Published : May 18, 2021, 8:46 AM IST

Updated : May 18, 2021, 12:09 PM IST

తౌక్టే తుపాను ధాటికి ముంబయిలో రెండు నౌకలు కొట్టుకోయిన ఘటనలో ఇప్పటివరకు 177 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రెండు నౌకలలో 410 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఎన్​ఎస్ కోల్​కతా, ఐఎన్​ఎస్​ కొచ్చి, ఐఎన్​ఎస్ తల్వార్ యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపారు.

సహాయక చర్యల్లో నిమగ్నమైన నౌకాదళ సిబ్బంది
కొనసాగుతున్న సహాయక చర్యలు

పీ 305 నౌకలో ఉన్న 146 మందికి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి :అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం

Last Updated : May 18, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details