తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2021, 9:51 AM IST

ETV Bharat / bharat

Cyclone Jawad update: 'జవాద్​' ముప్పు.. రంగంలోకి 266 సహాయక బృందాలు

Cyclone Jawad update: జవాద్​ తుపానును ఎదుర్కొనేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం 266 బృందాలను రంగంలోకి దింపింది.

Cyclone Jawad update, జవాద్​
'జవాద్​' ముప్పు.. ఒడిశా ప్రత్యేక ఏర్పాట్లు

Odisha cyclone Jawad: జవాద్​ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్​డీఆర్​ఎఫ్​, ఓడీఆర్​ఏఎఫ్​తో కూడిన 266 బృందాలను రంగంలోకి దించింది.

తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు ఒడిశా ఎస్​ఆర్​సీ(స్పెషల్​ రిలీఫ్​ కమిషనర్​). 14 తీర ప్రాంత జిల్లాలను అలర్ట్​గా ఉండాలని సూచించినట్టు స్పష్టం చేశారు. సమయం గడుస్తున్న కొద్ది.. పరిస్థితులపై మరింత స్పష్టత వస్తుందన్నారు. 24 ఎన్​డీఆర్​ఎఫ్​, 158 రాష్ట్ర అగ్నిమాపక సేవల బృందాలు, 33 ఓడీఆర్​ఏఎఫ్​ను ఆయా ప్రాంతాల్లో మోహరించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.

తుపాను ప్రభావం ఎంత?

Cyclone Jawad path: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా.. అనంతరం తుపానుగా బలపడనుంది. దీంతో సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.. గురువారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. సాయంత్రానికి ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం (3వ తేదీ) నాటికి తుపాను (జవాద్‌గా పిలుస్తున్నారు) గా మారి.. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించనుంది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుంది. అక్కడ నుంచి ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంది.

ఇదీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details