నివర్ తుపానును ఎదుర్కొని వారం రోజులు కూడా గడవక ముందే తమిళనాడుకు 'బురేవి' రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి శ్రీలంక తీరాన్ని బుధవారం తాకిన అనంతరం.. డిసెంబర్ 4న తమినాడు తీరాన్ని దాటుతుందని ఐఎండీ తెలిపింది. అయితే ఇది నివర్లా తీవ్ర ప్రభావం చూపదని పేర్కొంది. బురేవి ప్రభావంతో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. డిసెంబర్ 4 వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది.
తమిళనాడుకు పొంచి ఉన్న 'బురేవి' ముప్పు - Cyclone Burevi news
తమిళనాడుకు బురేవి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబరు 2న శ్రీలంకను దాటనున్న ఈ తుపాను.. డిసెంబరు 4న తమిళనాడును తాకనున్నట్లు పేర్కొంది. అయితే ఇది ఈ వారంలో సంభవించిన నివర్ తుఫాన్ అంత తీవ్ర ప్రభావం చూపబోదని పేర్కొంది.
తమిళనాడుకు పొంచిఉన్న 'బురేవి' ముప్పు
తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి తెలిపారు. దక్షిణ జిల్లాల ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కొలిక్కిరాని చర్చలు- కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో