తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శెభాష్ నిహారిక.. సైకిల్​పై ముంబయి నుంచి హైదరాబాద్​కు - సైక్లింగ్ నిహారిక

Cyclist Niharika: రోజుకు 200-250కిలోమీటర్లు.. మూడు రోజుల్లో సైకిల్​పై ముంబయి నుంచి హైదరాబాద్​కు.. పదో తరగతి బాలిక సాధించిన ఘనత ఇది. ఎవరామె? ఎందుకు ఇదంతా?

cyclist niharika
cyclist niharika

By

Published : Feb 14, 2022, 7:04 AM IST

Updated : Feb 14, 2022, 12:01 PM IST

సైకిల్​పై ముంబయి నుంచి హైదరాబాద్​కు

Mumbai to Hyd cycling: మహారాష్ట్ర నవీముంబయి ఖార్​ఘర్​కు చెందిన నిహారిక రెడ్డి(16) ముంబయి-హైదరాబాద్​ సైకిల్ యాత్రను మూడు రోజుల్లో పూర్తిచేసి అందరిచేత ఔరా అనిపించుకుంది. శుక్రవారం ఖార్​ఘర్​లో బయలుదేరిన ఆమె.. ఆదివారం రాత్రి హైదరాబాద్​ చేరుకుంది.

దారిలో
నిహారిక

3 రోజులు.. 700 కి.మీ..

Cycling Niharika: 'కల ఏదైనా.. సాకారం సాధ్యం! తొలి అడుగే కీలకం!!' అని సందేశం ఇచ్చే లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టింది నిహారిక. శ్రీధర్, ప్రభాకర్ బోనం, విజయ్ పాటిల్, భాస్కర్​ అనే మరో నలుగురు సైక్లిస్ట్​లు ఆమెకు తోడయ్యారు. శుక్రవారం వేకువజామున 3.45గంటలకు నిహారిక బృందం ఖార్​ఘర్​లో యాత్ర ప్రారంభించింది. నిహారిక తండ్రి, మరికొందరు వారిని కారులో అనుసరిస్తూ.. అవసరమైన సాయం అందించారు.

నిహారిక బృందం

Cyclist Niharika Muchintal:

నిహారిక బృందం రోజుకు దాదాపు 200-250కిలోమీటర్లు సైక్లింగ్ చేసింది. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల శనివారం ఆమె కాస్త ఇబ్బంది పడినా.. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గమ్యస్థానం చేరేవరకు పట్టువిడవకుండా ముందుకుసాగింది.

సరదాగా మొదలై..

నిహారిక సైక్లింగ్

నిహారిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి సరదా కోసం సైకిల్ తొక్కుతున్నా.. రెండేళ్ల క్రితమే ఆమెకు దీనిపై మక్కువ పెరిగింది. కోచ్​ సాయంతో ప్రొఫెషనల్ సైక్లింగ్​పై దృష్టిపెట్టింది. రోజూ 50 కిలోమీటర్లు, వారాంతాల్లో 100 కి.మీ సైక్లింగ్ చేయడం మొదలుపెట్టింది.

హోటల్​లో ఆగి...

"చదువుకు, సైక్లింగ్​కు సమప్రాధాన్యం ఇచ్చేందుకు మొదట్లో ఇబ్బందిపడ్డా. కానీ కొన్ని వారాల్లోనే ఆ సమస్యను అధిగమించా. సైక్లింగ్​.. స్ట్రెస్ బస్టర్. సైక్లింగ్ చేయడం వల్ల మా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా చదువుపై మరింత దృష్టిపెట్టగలుగుతున్నా. ఈ 708కి.మీ సైకిల్ యాత్ర.. ఇప్పటివరకు నేను చేసిన అతి పెద్ద రైడ్. ఈ యాత్ర.. నా కోచ్ సుధాకర్ రెడ్డికి అంకితం. ఆయన, మా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే నేను ఇక్కడివరకు రాగలిగేదాన్ని కాదు" అని చెప్పింది నిహారిక.

నిహారిక రెడ్డి
నిహారిక
ముంబయిలో జెండా ఊపి సైక్లింగ్ ప్రారంభిస్తుండగా...
హైదరాబాద్​కి చేరుకున్న నిహారిక బృందం

ఇదీ చదవండి:అంధుడి సాహసం.. 7,500 కిలోమీటర్ల సైకిల్​ యాత్ర!

Last Updated : Feb 14, 2022, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details