తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా పేరుతో సైబర్​ వల- చిక్కకుండా ఉందాం ఇలా.. - ఓటీపీలు సైబర్​ మోసాలు

ఏటీఎం​లు బ్లాక్​ చేయడం, లోన్ ​కావాలా అంటూ ఫోన్​ చేయడం... సైబర్​ నేరగాళ్ల పాత పద్ధతి. ట్రెండ్​ మారింది. సైబర్​ నేరగాళ్లూ మారిపోయారు. కరోనా భయాన్ని సులభంగా సొమ్ము చేసుకుంటున్నారు. టీకాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. మరి ఈ కపట వలలో చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం.

cyber criminals
టీకా పేరుతో సైబర్​ వల- చిక్కకుండా ఉందాం ఇలా!

By

Published : Jan 10, 2021, 7:23 PM IST

ఇప్పుడు అందరూ కొవిడ్​ వ్యాక్సిన్​ గురించే ఆలోచిస్తున్నారు. దీన్నే సైబర్​ నేరగాళ్లు ఆసరాగా మలుచుకుంటున్నారు. ఉన్న చోటనే ఉంటూ మన బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... సైబర్​ మోసాల బారిన పడకుండా ఉండడమెలాగో ఝార్ఖండ్​ పోలీసులు చెబుతున్నారు.

ఎలా మోసగిస్తారు?

ఐవీఆర్​ఎస్​ సాంకేతిక సాయంతో ఫోన్​ చేసి మాయమాటలు చెప్పి సైబర్​ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తారు. లేదా.. ఈమెయిల్​ ద్వారా లింక్​లు పంపుతారు. మనం ఆ లింకుల​ను క్లిక్​ చేసిన వెంటనే ఓ ప్రత్యేక సాఫ్ట్​ వేర్​ కూడా మన ఫోన్లలో చేరిపోతుంది. దాని సాయంతో హ్యాకర్లు మన ఫోన్​లో ఏమేం చేస్తున్నామో ప్రతిదీ గమనిస్తారు. ఏ సందేశాలు మనకు వస్తున్నాయి? ఎవరితో మనం ఫోన్​లో మాట్లాడుతున్నాం? అనే అంశాలపై కన్నేస్తారు. ఆ వివరాలతో ఇక సులువుగా మోసాలకు పాల్పడతారు.

మహమ్మారి పేరుతో మోసాలు...

కరోనా పరిస్థితుల మధ్య చాలా మంది తమ బ్యాంకు సంబంధిత సమాచారాన్ని ఫోన్​లోనే దాచుకుంటున్నారు. ఇదే సైబర్​ నేరగాళ్లకు ఆదాయాన్ని తెచ్చే మార్గంలా మారుతోంది. ఆరోగ్య అధికారుల్లాగా ఫోన్లు, మెసేజ్​లు చేసి.. తప్పుడు లింకులను మన ఫోన్​లోకి పంపుతున్నారు.

'అంతకుముందు.. ఏటీఎమ్​ కార్డులను బ్లాక్​ చేయడం లేదా రుణాలు పేరుతో మోసాలకు పాల్పడటం వంటివి చేసేవారు. కానీ, ఇప్పుడు ఏకంగా మన మొబైల్​ ఫోన్​లనే హ్యాక్​ చేస్తున్నారు' అని రాంచీ ఎస్పీ సౌరవ్​ తెలిపారు. దీనికోసం వారు తప్పుడు లింకులను ఫోన్​లోకి పంపిస్తున్నారని చెప్పారు. కొవిడ్​ కారణంగా ఇప్పుడందరూ భయాందోళనలో ఉన్నారని.. దీన్నే సైబర్​ నేరగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.

టీకా పేరుతో సైబర్​ వల- చిక్కకుండా ఉందాం ఇలా!

మొదటగా వ్యాక్సిన్​ మీకేనంటూ..

"ఇతరుల కంటే ముందుగా వ్యాక్సిన్‌ పొందాలనుకుంటున్నారా? అయితే రిజిస్ట్రేషన్‌ చేసుకొని నగదు చెల్లించండి" అంటూ సైబర్​ నేరగాళ్లు ఆకర్షిస్తారు. అప్పుడు.. వారు పంపిన లింకును క్లిక్​ చేశామంటే మన ఫోన్​కు ఓ ఓటీపీ వస్తుంది. టీకా కావాలంటే ఆ ఓటీపీ చెప్పాలని ఒత్తిడి చేస్తారు. పొరపాటున వాళ్లు చెప్పినట్లు చేశామో ఇక అంతే సంగతులు.. మన ఖాతాల్లోని సొమ్ము ఖాళీ అవ్వాల్సిందే. అందుకే లింకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు పోలీసులు.

ఆధార్​ నంబర్​ చెప్పక్కర్లేదు

సైబర్​ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే అవగాహన ఒక్కటే మార్గమని రాంచీ సైబర్​ డీఎస్పీ యశోధర పేర్కొన్నారు. కొవిడ్​ టీకాల కోసం ఆధార్​ నంబర్​ ఇవ్వాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు ఆధార్​కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు.

టీకా పేరుతో సైబర్​ వల- చిక్కకుండా ఉందాం ఇలా!

ఇదీ చూడండి:కరోనా టీకా పేరుతో సైబర్​ మోసాలు​

ABOUT THE AUTHOR

...view details