cyber security breach: భారత నిఘా వర్గాలు మంగళవారం ఆందోళనకర విషయాన్ని గుర్తించాయి. దేశ సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్లు వెల్లడించాయి. సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానాస్పద సంబంధాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నాయి. 'కొంతమంది సైనికాధికారుల ప్రమేయం ఉన్న సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనను నిఘా వర్గాలు, సైన్యం గుర్తించాయి. ఇది పొరుగుదేశాల గూఢచర్య కార్యకలాపాలతో ముడిపడి ఉండొచ్చు. వాట్సాప్ గ్రూప్‌ల వేదికగా ఈ ఉల్లంఘన జరిగింది' అని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించామని, దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు తప్పవని పేర్కొన్నాయి. కేసు సున్నితత్వం కారణంగా మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే ఎటువంటి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని అభ్యర్థించారు.
వాట్సాప్‌తో భారత సైనికాధికారులకు వల! పాక్, చైనా పనే!! - భారత్ సైన్యం సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన
cyber security breach: భారత సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్లు భారత నిఘా వర్గాలు మంగళవారం గుర్తించాయి. సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానాస్పద సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపాయి. దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించామని, దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు తప్పవని పేర్కొన్నాయి.
ఇటీవల కాలంలో మన సైన్యం కార్యకలాపాలను తెలుసుకునేందుకు అనుమానిత పాక్, చైనా నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం మన అధికారుల నుంచి సున్నిత సమాచారాన్ని పొందేందుకు సోషల్ మీడియాను వేదిక చేసుకుంటున్నాయి. శత్రు దేశాల ప్రయత్నాలు చాలా వరకు విఫలమైనప్పటికీ.. వీరి ఉచ్చులో పడిన కొందరు అధికారుల నుంచి కొంత సమాచారం పొందినట్లు తెలుస్తోంది. ఈ తరహా కేసుల్ని అరికట్టేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మార్గదర్శకాలను అనుసరించాలని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటారు.
ఇదీ చదవండి:రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిదో? విపక్షాలు కలిసి నడిస్తే విజయం తథ్యం!