తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CWC Engineering Jobs : డిగ్రీ, ఇంజినీరింగ్​ అర్హతతో.. సీడబ్ల్యూసీలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా! - సెంట్రల్ వేర్​హౌసింగ్ కార్పొరేషన్​ జాబ్స్​ 2023

CWC Engineering Jobs In Telugu : సెంట్రల్​ వేర్​హౌసింగ్​ కార్పొరేషన్​ (CWC) 153 అసిస్టెంట్​ ఇంజినీర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్​, అకౌంటెంట్​​ సహా ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

CWC Recruitment 2023
CWC Engineering Jobs

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 11:05 AM IST

CWC Engineering Jobs :డిగ్రీ, ఇంజినీరింగ్ చేసి ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. సెంట్రల్​ వేర్​హౌసింగ్​ కార్పొరేషన్​ (CWC) 153 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా అసిస్టెంట్​ ఇంజినీర్​ ​, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్​ సహా పలు ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్​ 24లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
CWC Jobs :

  • అసిస్టెంట్​ ఇంజినీర్​ (సివిల్​) - 18
  • అసిస్టెంట్​ ఇంజినీర్​ (ఎలక్ట్రికల్​) - 05
  • అకౌంటెంట్​ - 24
  • సూపరింటెండెంట్​ (జనరల్​) - 11
  • జూనియర్​ టెక్నికల్​ అసిస్టెంట్ - 81
  • సూపరింటెండెంట్​ (జనరల్​) - SRD (NE) -02
  • జూనియర్​ టెక్నికల్​ అసిస్టెంట్ - SRD (NE) -01
  • జూనియర్​ టెక్నికల్​ అసిస్టెంట్ - SRD (లద్ధాఖ్​) - 02

విద్యార్హతలు
CWC Eligibility :

  • అసిస్టెంట్​ ఇంజినీర్​పోస్టులకు సివిల్​, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అకౌంటెంట్​ పోస్టులకు బీకాం, బీఏ (కామర్స్​), ఛార్టర్డ్​ అకౌంటెంట్​ చేసి ఉండాలి. ముఖ్యంగా 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
  • సూపరింటెండెంట్​ ఉద్యోగాలకు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్​ గ్రాడ్యుయేషన్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • జూనియర్​ టెక్నికల్​ అసిస్టెంట్ పోస్టులకు అగ్రికల్చర్​, జువాలజీ, కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ సబ్జెక్ట్​ల్లో కనీసం ఏదైనా ఒకటి ప్రధాన అంశంగా డిగ్రీ చేసి ఉండాలి.
  • పూర్తి వివరాల కోసం సీడబ్ల్యూసీ అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి
CWC Age Limit :

  • అసిస్టెంట్​ ఇంజినీర్​, అకౌంటెంట్​, సూపరింటెండెంట్​ అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్​ 24 నాటికి 30 ఏళ్లు మించరాదు.
  • జూనియర్​ టెక్నికల్ అసిస్టెంట్​ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు 2023 సెప్టెంబర్​ 24 నాటికి 28 ఏళ్ల మించి ఉండకూడదు.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్​ సర్వీస్​మెన్​కు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం
CWC Selection Process :
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
CWC Application Process :

  • ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు ముందుగా www.cewacor.nic.in వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లోని Career @CWC ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ముందుగా నోటిఫికేషన్ వివరాలు అన్నీ పూర్తిగా చదవాలి.
  • ఆన్​లైన్ అప్లికేషన్​ ఫారమ్​ను క్లిక్ చేసి ఓపెన్​ చేయాలి.
  • New Registration పై క్లిక్​ చేసి, మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్​ నమోదు చేసి.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్​ పూర్తి చేయాలి.
  • మీకు వచ్చిన ప్రొవిజనల్​ రిజిస్ట్రేషన్​ నంబర్​, పాస్​వర్డ్​లను​ జాగ్రత్తగా నోట్​ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
CWC Apply Late Date :సీడబ్ల్యూసీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 24

ABOUT THE AUTHOR

...view details